Indian Railways: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే.. పట్టాల పైకి మరిన్ని రైళ్లు..

దేశంలో అన్లాక్ ల ప్రక్రియ మొదలై.. జనజీవనం మెల్లగా పూర్వ స్థితిలోకి చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

news18
Updated: October 7, 2020, 6:34 PM IST
Indian Railways: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే.. పట్టాల పైకి మరిన్ని రైళ్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 7, 2020, 6:34 PM IST
  • Share this:
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో దెబ్బతిన్న ప్రజా రవాణా వ్యవస్థ మెల్లిగా పుంజుకుంటున్నది. రోడ్డు రవాణా దాదాపు పూర్తి స్థాయిలో మెరగవగా.. విమానాలూ నడుస్తున్నాయి. అయినా దేశంలో పేదవాడి విమానంగా భావించే రైళ్లు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందుులు ఎదుర్కొంటున్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పాటు.. మరో 39 రైళ్లను నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్ల కేటగిరీలోనే వీటిని నడుపనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇవి ఎప్పటినుంచి నడిపిస్తారోననే విషయమ్మీద స్పష్టత ఇవ్వకపోయినా... పండుగల సీజన్ ముందుండటంతో దాదాపు వచ్చే పది, పదిహేను రోజుల్లో ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా రావొచ్చునని తెలుస్తున్నది.

రైల్వే ప్రకటించిన 39 రైళ్ల జాబితాలో పలు రైళ్లు ఇవే..
లోకమాన్య తిలక్ (టి) టు హరిద్వార్ (బైవిక్లీ), లోకమాన్య తిలక్ (టి) టు లక్నో (వీక్లీ), అజ్ని టు పూణె (వీక్లీ), న్యూఢిల్లీ టు కట్ర (వీక్లీ), నిజాముద్దీన్ టు పూణె (వీక్లీ), సికింద్రాబాద్ టు షాలిమార్ (వీక్లీ), లింగంపల్లి టు కాకినాడ (వీక్లీ), హౌరా టు యశ్వంత్ పూర్ (వీక్లీ)..

పూర్తి వివరాల జాబితా ఇదిగో..



కాగా, ఈ రైళ్లన్నీ ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, దురంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లే. వీటితో పాటు రానున్న దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో పలు రూట్లలో నడుస్తున్న తేజస్ రైళ్లను కూడా నడపనున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయిల మధ్య నడకిచే తేజస్ రైళ్లను ఈ నెల 17 నుంచి నడుపనున్నారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే తేజస్ రైళ్ల లో ప్రయాణించేవాళ్ల కోసం రైల్వేశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రైలు ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరూ థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించాలి. మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించాలి. ఈ రైళ్లలో ప్రతి రెండో సీటు ఖాళీగానే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రయాణికులందరూ ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా వాడాలి. ప్రయాణికుల భద్రతకు సంబంధించి సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చామని ఐఆర్సీటీసీ తెలిపింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో ఈ ఏడాది మార్చి 25 నుంచి రైళ్లన్నీ బంద్ అయ్యాయి. ఆ తర్వాత వలసకార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 230 ప్రత్యేక రైళ్లను నడిపింది.
Published by: Srinivas Munigala
First published: October 7, 2020, 6:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading