ఫ్రీ కాదు..రాష్ట్రాలదే బాధ్యత..శ్రామిక్ రైలు చార్జీ ఎంతంటే..

శ్రామిక్ రైళ్లలను రైల్వేశాఖ ఉచితంగా నడపడం లేదు. వలస కార్మికుల తరపున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు చెల్లించాలి. దానికి సంబంధించి ఒక్కో ప్రయాణికులుడికి ఎంత చెల్లించాలన్న ధరలను సైతం నిర్ణయించారు.

news18-telugu
Updated: May 2, 2020, 11:10 AM IST
ఫ్రీ కాదు..రాష్ట్రాలదే బాధ్యత..శ్రామిక్ రైలు చార్జీ ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా కేంద్రహోశాఖ విడుదల చేసింది. ఐతే శ్రామిక రైళ్లలో ఎవరికి అనుమతి ఉంటుంది? వేరే రాష్ట్రాల కార్మికులందరినీ ఇస్తారా? ప్రత్యేకంగా టికెట్లు ఏమైనా ఇస్తారా? డబ్బులేవైనా చెల్లించాలా? రైల్వే స్టేషన్లకు ఎలా చేరుకోవాలన్న దానిపై వలస కార్మికుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వీటికి సంబంధించి రైల్వే శాఖ కొంత వరకు క్లారిటీ ఇచ్చింది.

శ్రామిక్ రైళ్లు పాయింట్ టు పాయింట్ మాత్రమే నడుస్తాయి. అంటే ఇక్కడ ప్రారంభమైతే గమ్యస్థానం వరకు నాన్‌స్టాప్‌గా వెళ్తుంది. మధ్యలో ఎక్కడా ఆగదు. ఈ ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి టికెట్లు మంజూరు చేయరు. అందుకే టికెట్ల కోసం ఎవరూ రైల్వే స్టేషన్‌లకు రావొద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కేవలం సదరు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చిన వారిని మాత్రమే శ్రామిక రైళ్లలో అనుమతిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్న వలస కార్మికులు, పర్యాటకులు, యాత్రికులు, విద్యార్థులకు మాత్రమే ఇందులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రైళ్లలో ఎవరిని తీసుకెళ్లాలన్న అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుదని.. తాము కేవలం రైళ్లను మాత్రమే నడుపుతామని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

ఇక శ్రామిక్ రైళ్లలను రైల్వేశాఖ ఉచితంగా నడపడం లేదు. వలస కార్మికుల తరపున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు చెల్లించాలి. దానికి సంబంధించి ఒక్కో ప్రయాణికులుడికి ఎంత చెల్లించాలన్న ధరలను సైతం నిర్ణయించారు. ఒక్కో ప్రయాణికుడిపై స్లీపర్ క్లాస్ టికెట్ ధరతో పాటు సూపర్ ఫాస్ట్ చార్జీ కింద రూ.30, భోజనం, తాగునీరుకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు లింగంపల్లి నుంచి ఝర్ఖండ్‌లోని హటియాకు శుక్రవారం ఉదయం శ్రామిక్ రైలు వెళ్లింది. దాని స్లీపర్ క్లాస్ టికెట్ రూ.600 అనుకుంటే.. దీనికి సూపర్ ఫాస్ట్ చార్జీ 30, భోజనం, తాగునీరు చార్జీ 20 కలిపి... మొత్తం 650 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది.ఇక వలస కార్మికులను ఏ ప్రాతిపదికన పంపిస్తారు? వారంత తమ పేర్లను ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఏ రైల్వే స్టేషన్ నుంచి రైలు నడపాలి? బస్సులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: May 2, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading