పేదల ఖాతాల్లో డబ్బులు వేయండి... కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

‘ప్రభుత్వం నేరుగా పేదలు, వలస కూలీలు, రైతులు, ఇతర అవసరం ఉన్నవారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలి.’ అని రాహుల్ గాంధీ సూచించారు.

  • Share this:
    కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కార్మికుల చేతికి నేరుగా డబ్బులు చేరేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. వలస కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్న వలస కూలీలు, రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రభుత్వం నేరుగా పేదలు, వలస కూలీలు, రైతులు, ఇతర అవసరం ఉన్నవారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలి. పేదల చేతిలో నేరుగా డబ్బులు పెట్టడం ముఖ్యం.’ అని రాహుల్ గాంధీ అన్నారు. పేదలకు సాయం చేయకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆరంభం కాదని చెప్పారు. వలస కూలీలకు సాయం ఇప్పుడే చేయాలి. తర్వాత కాదు అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పేదల చేతికి డబ్బులు అందకపోతే వారి జీవితాల్లో తీవ్రమైన మార్పులు వస్తాయన్నారు. లక్షల మంది వలస కూలీలు తిండి, డబ్బులు లేక రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండడం చూసి చాలా బాధేస్తోందన్నారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయ్ పథకాన్ని తాత్కాలికంగా అయినా అమలు చేయాలని రాహుల్ గాంధీ సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: