ఆ లాక్‌డౌన్ ఫొటోలకు బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఫిదా.. మీరూ చూసేయండి

ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులు ఫోటోల నాణ్యత, సాంకేతిక నైపుణ్యం మీద కాకుండా భావోద్వేగాలు, అనుభవాలను ప్రతిబింబించే చిత్రాలను ఎంచుకున్నారు. త్వరలోనే వాటిని బ్రిటన్‌లో ప్రదర్శిస్తారు.

news18-telugu
Updated: September 15, 2020, 1:30 PM IST
ఆ లాక్‌డౌన్ ఫొటోలకు బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఫిదా.. మీరూ చూసేయండి
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్
  • Share this:
కరోనా లాక్‌డౌన్‌ను కళ్లకు కట్టేలా చూపించిన ఫొటోలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఫిదా అయ్యారు. డచ్ ఆఫ్ కేంబ్రిడ్జ్, బ్రిటన్ యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ ప్రారంభించిన హోల్డ్ స్టిల్ అనే ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్‌ను ఆమె అభినందించారు. కరోనావైరస్ లాక్‌డౌన్‌లో బ్రిటన్ అందాలను ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 30,000 కి పైగా ఫొటోలు వచ్చాయి. వీటి నుంచి కేట్, మరో నలుగురు న్యాయమూర్తులు కలిసి తుది 100 చిత్రాలను ఎంపిక చేశారు. వీటిని సోమవారం నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ ఆన్‌లైన్‌లో ప్రచురించింది. వీటిపై బ్రిటన్ రాణి ఎలిజబెత్ లేఖ ద్వారా స్పందించారు. "డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్, నేను ఈ ఫొటోలను పరిశీలించాం. సంక్షోభ సమయంలో బ్రిటీష్ ప్రజలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో వాటి ద్వారా తెలుస్తోంది. ఫ్రంట్‌లైన్ కార్మికుల సేవలను, సమాజ స్ఫూర్తిని గుర్తించడం, అవసరమైన వారికి సేవలందించే వ్యక్తుల ప్రయత్నాలను చూపించే ఫోటోలు స్ఫూర్తిని చాటేలా ఉన్నాయి” అంటూ లేఖలో ఆమె పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టును మే నెలలో ప్రారంభించారు. ఇందులో భాగంగా మార్చిలో ప్రారంభమైన కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తీసిన ఫోటోలను పంపించాలని సూచించారు. బ్రిటన్‌లో ఉన్న అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనొచ్చని చెప్పారు. సహాయకులు, వీరులు, దయతో చేసే చర్యలు... ఈ మూడు థీమ్‌లను ప్రాజెక్టుకు ఎంచుకున్నారు. వీటిలో కొన్నిఫొటోలు బ్రిటన్లోని పట్టణాలు, నగరాల్లో ప్రదర్శిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

కాగా, ప్రిన్స్ విలియం భార్య కేట్ మంచి ఫోటోగ్రాఫర్. ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులు ఫోటోల నాణ్యత, సాంకేతిక నైపుణ్యం మీద కాకుండా భావోద్వేగాలు, అనుభవాలను ప్రతిబింబించే చిత్రాలను ఎంచుకున్నారు. త్వరలోనే వాటిని బ్రిటన్‌లో ప్రదర్శిస్తారు.
Published by: Shiva Kumar Addula
First published: September 15, 2020, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading