news18-telugu
Updated: March 24, 2020, 7:10 PM IST
ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలు సైతం కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ.. అత్యవసరమైతే.. తప్ప ఇళ్లలోంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కానీ కొంతమంది పౌరులు ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. యథేచ్చగా రోడ్ల మీద తిరుగుతున్నారు. విజయవాడ నగరంలోని రామవరప్పాడు వద్ద శ్రీధర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రామవరప్పాడు రింగురోడ్డు వద్ద కానిస్టేబుల్ శ్రీధర్ వాహనాలను నియంత్రిస్తున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ క్వాలిస్ వాహనం.. అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ తలకు గాయాలు కావడంతో వెంటనే పక్కనే ఉన్న తోటి సిబ్బంది కానిస్టేబుల్ శ్రీధర్‌ను మరో వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
Published by:
Narsimha Badhini
First published:
March 24, 2020, 7:10 PM IST