చేతులు కడుక్కో.. విరాట్ కొహ్లీకి పీవీ సింధు 'హ్యాండ్ వాష్' చాలెంజ్

హ్యాండ్ వాష్ చాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను నామినేట్ చేశారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనా నుంచి కాపాడుకోవచ్చని ప్రజలకు సూచించారు.

news18-telugu
Updated: March 17, 2020, 10:24 PM IST
చేతులు కడుక్కో.. విరాట్ కొహ్లీకి పీవీ సింధు 'హ్యాండ్ వాష్' చాలెంజ్
పీవీ సింధు, విరాట్ కొహ్లీ
  • Share this:
చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చు. ఆ మహమ్మారి మన దరి చేరకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఈ క్రమంలో WHO కొత్త ఛాలెంజ్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #SafeHandsChallenge, #HandWashChallenge ట్రెండ్ అవుతోంది. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు చేతులు శుభ్రం చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. హ్యాండ్‌ వాష్‌తో చేతులను కడుక్కుంటూ సందడి చేస్తున్నారు. ఇలా చేయమంటూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. తద్వారా కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా తెలుగు తేజం, బ్మాడ్మింటన్ క్వీన్ పీవీ.సింధు సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కేథరిన్ హడ్డా విసిరిన చాలెంజ్‌ని స్వీకరించి.. చేతులను శుభ్రం చేసుకున్నారు. అనంతరం ఈ చాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను నామినేట్ చేశారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనా నుంచి కాపాడుకోవచ్చని ప్రజలకు సూచించారు.

First published: March 17, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading