ప్యూర్ గోల్డ్ మాస్క్... అవి కూడా ఫ్యాషన్ అయిపోయాయి...

ప్యూర్ గోల్డ్ మాస్క్... అవి కూడా ఫ్యాషన్ అయిపోయాయి...

ప్యూర్ గోల్డ్ మాస్క్... అవి కూడా ఫ్యాషన్ అయిపోయాయి... (credit - twitter - ANI)

రోజూ రొటీన్ మాస్కులు పెట్టుకొని... అతనికి బోర్ కొట్టేసింది. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. ఫలితమే ఈ గోల్డ్ మాస్క్.

 • Share this:
  మహారాష్ట్రలో కరోనా ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలుసు. అలాంటి చోట... కరోనా సమయంలోనూ కొంత మంది క్రియేటివిటీ కోసం ట్రై చేస్తున్నారు. ఇదిగో ఇతను పుణె జిల్లాలోని పింప్రీ-చింద్వాడకు చెందినవాడు. పేరు శంకర్ కురాడే. రోజూ రొటీన్ మాస్కులు వాడటం, పారేయడం బోరు కొట్టేసింది. ఏదైనా పర్మనెంట్ మాస్క్ ఉండాలనుకున్నాడు. కొంత మంది వెండితో మాస్కుల్ని చెయ్యడం చూశాడు. దాంతో... తనకు బంగారంతో చేసిన మాస్క్ ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. సూపర్ ఐడియా అని మనసులో అనుకున్నాడు. అంతే... ఓ బంగారం షాపుకి వెళ్లి... మేటర్ చెప్పాడు. మాస్క్ తయారీకి ఎంతవుతుంది అని అడిగితే... వాళ్లు ఏవో లెక్కలు వేసుకొని... రూ.10 లక్షల దాకా అవుతుందని చెప్పారు.


  "నేను మాస్క్ అడిగింది... మూతి, ముక్కుకే... ముఖం మొత్తానికీ కాదు" అని సెటైర్ వెయ్యడంతో... వాళ్లు మరోసారి ఆలోచించి... రూ.3 లక్షలు అవుతుంది అని చెప్పారు. మరికాస్త బేరమాడి... రూ.2.89 లక్షలకు మాస్క్ తయారుచేయించుకున్నాడు.

  ప్యూర్ గోల్డ్ మాస్క్...
  (credit - twitter - ANI)


  మాస్కుకైతే చిన్న కన్నాలుంటాయి కాబట్టి గాలి లోపలికి వెళ్లగలదు. మరి ఈ మాస్క్ విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యంత సన్నగా ఉండే ఈ మాస్కుకి కూడా చిన్న చిన్న కన్నాలు పెట్టారు. అందువల్ల శంకర్ మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఐతే... ఇది కరోనాను ఆపేస్తుందా అని అడిగితే... "ఏమో నాకూ తెలీదు... పెట్టుకున్నానంతే" అంటున్నాడు.

  ఈ ఫొటోలు సోషల్ మీడియాలోకి వెళ్లాక నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పనిచేస్తుందో లేదో అనే డౌట్ ఉన్నప్పుడు పెట్టుకోవడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తుంటే... డబ్బంటే లెక్క లేకుండా పోతోంది కొందరికి అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. అంత డబ్బు దానికి తగలేసే బదులు... ఆ డబ్బుతో ఎంతో మందికి కాటన్ మాస్కులు కొనివ్వొచ్చుగా అని మరికొందరు అంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు