హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా ఎఫెక్ట్.. ఇప్పుడు ప్రజా రవాణా ప్రమాదమే..

కరోనా ఎఫెక్ట్.. ఇప్పుడు ప్రజా రవాణా ప్రమాదమే..

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సమయంలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తే ప్రమాదమని తాజా సర్వే హెచ్చరించింది.

    కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సమయంలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తే ప్రమాదమని తాజా సర్వే హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజా రవాణాను పునరుద్ధరిస్తే.. వ్యాప్తి వేగంగా పెరిగి, మరింత దారుణ స్థితికి చేరుకుంటుందని తెలిపింది. త్వరలో దేశవ్యాప్తంగా ప్రజా రవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన నేపథ్యంలో.. ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొస్తే తగ్గుతున్న వైరస్ వ్యాప్తిని పెంచినట్లే అవుతుందని కొందరు వాదిస్తున్నారు. ఆటోలు, జీపులు, ఆర్టీసీ బస్సులు, రైళ్లు.. ఇతర సదుపాయాలు వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని, బస్సులో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా బస్సులోని అందరికీ పాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

    ప్రజా రవాణా వినియోగం దేశంలో 22 శాతంగా ఉంది. ఓ సర్వే ప్రకారం.. ముంబై 44 శాతంతో ముందంజలో ఉండగా.. 6 శాతంతో రాయ్‌పూర్‌ చివరి స్థానంలో ఉంది. 24 శాతంతో విశాఖపట్నం 18వ స్థానంలో ఉండగా.. 22శాతంతో హైదరాబాద్‌ 19వ స్థానం, 20 శాతంతో విజయవాడ 21వ స్థానంలో ఉన్నాయి.

    First published:

    Tags: Rtc, Telugu news

    ఉత్తమ కథలు