హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Mask problem : ఓ స్టూడెంట్.. క్లాసులో మాస్క్ పెట్టుకోనందుకు. ప్రొఫెసర్ చేసిన పని చూస్తే షాకే...!

Mask problem : ఓ స్టూడెంట్.. క్లాసులో మాస్క్ పెట్టుకోనందుకు. ప్రొఫెసర్ చేసిన పని చూస్తే షాకే...!

Mask problem

Mask problem

Mask problem : ఓ ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తున్న సమయంలో విద్యార్థిని మాస్క్ పెట్టుకోనందుకు వెంటనే ఫ్రోఫెసర్‌ గా రిజైన్ చేసి వెళ్లిపోయారు. అయితే ఆ విద్యార్థి మాత్రం ఎలాంటీ సంకోచం లేకుండా ప్రొఫెసర్ వెళ్లి పోయినందుకు సంతోషింది కూడా...

కరోనా (corona)కాలంలో మాస్క్(mask) లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. అయితే ప్రభుత్వాలు , ఇటు ప్రజలు ఎంత మొత్తుకున్నా కొంతమంది మాత్రం మాస్క్ పెట్టుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఏదో తూతూ మంత్రంగా మాస్క్ ధరిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే కరోనా సోకినా ఇమ్యునిటితో బయటపడే వారికి ఇది పెద్దగా ఎఫెక్ట్ కాకపోయినా... సరైన ఇమ్యునిటి లేక పోవడంతో , అధిక వయస్సు ఉన్నవారికి , ఇతర రోగాలతో బాధపడేవారికి మాత్రం కరోనా చాలా ఇబ్బంది పెడుతోంది. దీంతో తనతోపాటు ఎదుటి వారు ఎలాంటీ జాగ్రత్తలు తీసుకోకపోయినా.. వారికి ఎఫెక్ట్ అయ్యో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. దీంతో కొంత కంట్రోల్(control) అవుతున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే మాస్క్ ధరించేందకు ముందుకు రావడం లేదు.. ఇలా ఓ విద్యార్థిని(student) మాస్క్ ధరించని కారణంగా ఏకంగా ప్రొఫెసర్ తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయిన సంఘటన జార్జీయా యూనివర్శిటిలో చోటు చేసుకుంది.

ఇది చదవండి :   కొవిడ్ ఆసుపత్రిలో గ్రూప్ సెక్స్... ఇంకా చాలా సిత్రాలు ఉన్నాయ్.. !


వివరాల్లోకి వెళితే.. ప్రొఫెసర్ పేరు ఇర్విన్ బెర్న్​స్టీన్, జార్జియా యూనివర్సిటీలో సైకాలజీ బోధిస్తున్నారు. అయితే ఓ రోజు ఇర్విన్ క్లాస్ చెబుతుండగా.. ఓ విద్యార్థిని మాస్కును ముక్కు కవర్ చేయకుండా ధరించడం గమనించాడు.. ఆ తర్వాత మాస్క్​ సరిగ్గా పెట్టుకోవాలని సూచించారు. అయితే ఆ విద్యార్థిని మాత్రం వినలేదు... ఇలా ప్రొఫెసర్ ఎన్నిసార్లు చెప్పినా ఆ స్టూడెంట్​ ప్రొఫెసర్ మాటలను పెడచెవిన పెట్టింది. మాస్కు ముక్కుపైనుంచి ధరిస్తే ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పింది. దీంతో మాస్కు సరిగ్గా ధరించకపోతే రాజీనామా చేసి వెళ్లిపోతానని

అయితే కోపం వచ్చిన ప్రొఫెసర్ ఇర్విన్ ఆమెను హెచ్చరించారు. అయినా.. కొన్ని క్షణాల పాటు వేచి చూసినా ఆ అమ్మాయి తీరు మారలేదు. 88 ఏళ్ల వృద్ధుడైన తనకు మధుమేహం ఉందని, కొవిడ్ ముప్పు ఎక్కువని విద్యార్థికి చెప్పే ప్రయత్నం చేసినా ఆమె పట్టించుకోలేదు. దీంతో 'అయామ్ రిటైరింగ్​' అని తన బ్యాగులో పుస్తకాలు సర్దుకొని ఇర్విన్ వెళ్లిపోయారు.

తన దేశం కోసం సైన్యంలో పనిచేసినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టానని, కానీ ఇప్పుడు మాస్క్ సరిగ్గా ధరించని ఓ నిర్లక్ష్యపు స్టూడెంట్​కు క్లాస్ చెప్పి తన జీవితాన్ని రిస్క్ చేయలేనని ప్రొఫెసర్ ఈ సంధర్భంగా వ్యాఖ్యానించాడు.. అయితే జార్జియా యూనివర్సిటీ విద్యార్థులు మాస్కు ధరించాలని కచ్చితమైన నిబంధన ఏమీ లేదు. అయితే తరగతులు మొదలైన రెండో రోజే ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. దీంతో తన క్లాస్లులో మాస్కు తప్పనిసరి అని ఇర్విన్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయంపై తన క్లాసు బయట స్టిక్కర్ కూడా అంటించారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన ప్రొఫెసర్ తన దారిన తాను పోయాడు. అయినా ఆ విద్యార్థిలో మాత్రం ఎలాంటీ పశ్చాత్తాపం లేదని గమనించారు. దీంతో ఆ న్యూస్ వైరల్ మారుతోంది. మాస్క్ కోసం ఉద్యోగాన్నే వదులు కోవడం మాములు కాదు కదా మరి...!

First published:

Tags: Corona, Face mask

ఉత్తమ కథలు