తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ 10 లక్షల చెక్ అందజేసిన నిర్మాత దిల్ రాజు..

Dil Raju | కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా చెక్‌ను కేటీఆర్‌కు అందజేసారు.

news18-telugu
Updated: April 10, 2020, 2:56 PM IST
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ 10 లక్షల చెక్ అందజేసిన నిర్మాత దిల్ రాజు..
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్ అందజేసిన నిర్మాత దిల్ రాజు (Twitter/Photo)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అందరికీ మద్దతుగా నిలిచేందుకు పలువురు  ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. తాజాగా ఈ రోజు దిల్ రాజు.. రూ.10 లక్షల చెక్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేసారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా నాని హీరోగా ‘వి’ సినిమా తెరకెక్కించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్‌ సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా.
First published: April 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading