Covid-19 lockdown: వ్యాపారాలు, ఉద్యోగాలపై ప్రధాని మోదీ చెప్పిన 5 విషయాలివే

Covid-19 lockdown | మానవ కార్యకలాపాలు నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రకృతి దేవత ఎంత వేగంగా వర్థిల్లుతుందో మనం చూస్తున్నాం. గ్రహంపై ప్రభావం తక్కువగా ఉంటే కార్యకలాపాలు, టెక్నాలజీనీ రూపొందించే భవిష్యత్తు ఉంది. అంటే తక్కువ పనితో ఎక్కువ ఫలితాలు పొందడం.

news18-telugu
Updated: April 20, 2020, 12:02 PM IST
Covid-19 lockdown: వ్యాపారాలు, ఉద్యోగాలపై ప్రధాని మోదీ చెప్పిన 5 విషయాలివే
నరేంద్ర మోదీ (credit - twitter - ANI)
  • Share this:
కరోనా వైరస్ లాక్‌డౌన్‌ మన వ్యాపారాలు, ఉద్యోగ సంస్కృతిని ఎలా మార్చేశాయో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు. వర్క్, లైఫ్‌స్టైల్‌పై మోదీ తన ఆలోచనల్ని లింక్డ్‌ఇన్‌కు రాసిన ఆర్టికల్‌లో వివరించారు. యువ దేశంగా పేరు తెచ్చుకున్న భారతదేశం సరికొత్త వర్క్ కల్చర్‌ను అందించడంలో వినూత్న ఉత్సాహంతో ముందడుగు వేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా సరికొత్త బిజినెస్ మోడల్స్‌తో పనిచేస్తుందున్నారు. కోవిడ్ 19 తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుందో, కొత్త బిజినెస్, వర్క్ కల్చర్‌ ఎలా ఉండనుందో ఇంగ్లీష్‌లోని అచ్చులు A, E, I, O, U ద్వారా వివరించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఎలాగో తెలుసుకోండి.

Adaptability: అడాప్టబిలిటీ అంటే స్వీకృతి. మనం ఎలా స్వీకరిస్తాం, అన్వయించుకుంటాం అని. సులభంగా స్వీకరించగలిగే వ్యాపారం, జీవనశైలి గురించి ఆలోచించాలి. అంటే సంక్షోభ సమయంలో కూడా కార్యాలయాలు, వ్యాపారాలు, వాణిజ్యం సాగుతుండాలి. ప్రాణనష్టం జరగకూడదు. డిజిటల్ పేమెంట్స్ ప్రధాన ఉదాహరణ. చిన్న, పెద్ద షాపు యజమానులు డిజిటల్ టూల్స్ ఉపయోగించుకొని సంక్షోభ సమయంలో కూడా వారి వ్యాపారాలు కొనసాగించాలి. భారతదేశంలో ఇప్పటికే డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. టెలీమెడిసిన్ మరో ఉదాహరణ. క్లినిక్, హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కన్సల్టేషన్స్ జరుగుతున్నాయి. ఇది కూడా సానుకూల సంకేతమే. ప్రపంచవ్యాప్తంగా టెలిమెడిసిన్‌కు సహాయపడే వ్యాపార నమూనాలను ఆలోచించగలమా?

Efficiency: ఎఫీషియెన్సీ అంటే సమర్థత. సమర్థవంతంగా ఉండటమంటే ఏంటీ అనే అంశాన్ని మనం తిరిగి ఆలోచించాల్సిన సమయం అది. సమర్థత అంటే ఎంతసేపు ఆఫీసులో ఉన్నాం అన్న విషయం కాదు. ప్రత్యక్షంగా కనిపించడం కన్నా ఉత్పాదకత, సమర్థత కీలకంగా మారే మోడల్స్‌ వైపు ఆలోచించాలి. అంటే సూచించిన సమయంలో ఓ పనిని పూర్తిచేయగలగడం అన్నమాట.

Inclusivity: ఇన్‌క్లుజివిటీ అంటే కలుపుకోవడం. పేదలు, బలహీనవర్గాలతో పాటు మన గ్రహాన్ని సంరక్షించగలికే బిజినెస్ మోడల్స్‌ని రూపొందిద్దాం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఎంతో పురోగతి సాధించాం. మానవ కార్యకలాపాలు నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రకృతి దేవత ఎంత వేగంగా వర్థిల్లుతుందో మనం చూస్తున్నాం. గ్రహంపై ప్రభావం తక్కువగా ఉంటే కార్యకలాపాలు, టెక్నాలజీనీ రూపొందించే భవిష్యత్తు ఉంది. అంటే తక్కువ పనితో ఎక్కువ ఫలితాలు పొందడం. తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఆరోగ్య పరిష్కారాలపై పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేసింది కోవిడ్ 19. పరిస్థితులతో సంబంధం లేకుండా రైతులకు సమాచారం, యంత్రాలు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, మన పౌరులు కూడా నిత్యావసరాలను పొందగలిగే ఆవిష్కరణలు చేయాలి.

Opportunity: ఆపర్చ్యునిటీ అంటే అవకాశం. ప్రతీ సంక్షోభం కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. కోవిడ్ 19 కూడా అంతే. ప్రస్తుత సంక్షోభం నుంచి కొత్త అవకాశాలు, కొత్తగా వృద్ధి చెందే అంశాలను అంచనా వేద్దాం. కోవిడ్ 19 తర్వాత భారతదేశం అందరికంటే ముందు ఉండాలి. ఇందుకోసం మన ప్రజలు, నైపుణ్యాలు, ప్రధాన సామర్థ్యాలు ఎలా పనిచేయాలో ఆలోచించాలి.

Universalism: యూనివర్సలిజం అంటే సార్వత్రిక వాదం. కోవిడ్ 19 జాతి, మతం, కులం, రంగు, భాష, సరిహద్దు లాంటివేవీ పట్టించుకోకుండా దాడి చేస్తోంది. మన ప్రతిస్పందన, ప్రవర్తనలో ఐక్యతకు, సోదరభావానికి ప్రాధాన్యతనివ్వాలి. మనమంతా కలిసే ఉన్నాం.

ఈ విషయాలపై అందరూ దృష్టిపెట్టి తమవంతు సహకారాన్ని అందించాలి. ప్రస్తుతం బ్రింగ్ యువర్ ఓన్ డివైజ్-BYOD నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్-WFH స్థితిలోకి మారడం ఉద్యోగ, వ్యక్తిగత అంశాలను బ్యాలెన్స్ చేయడం కొత్త సవాళ్లను విసురుతోంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆరోగ్యం, వ్యాయామంపై దృష్టిపెట్టండి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయండి. ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఆరోగ్య సూత్రాలను పాటించండి. చివరగా అందరూ ఆరోగ్య సేతు మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.ఇవి కూడా చదవండి:

LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే

Gold: అదిరిపోయే ఆఫర్... మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... కొనండి ఇలా

JioPOS Lite App: ఈ జియో యాప్‌తో డబ్బు సంపాదించండి ఇలా
First published: April 20, 2020, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading