పులికి కరోనా ఎఫెక్ట్.. నెహ్రూ జూ పార్కులో శానిటేషన్ పనులు..

జూ పార్కులో శానిటేషన్ పనులు

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు, పక్షులకు.. ఇతర జీవాలకు కరోనా సోకకుండా జాగ్రత్త పడుతున్నారు.

  • Share this:
    అమెరికాలోని Bronx Zooలోని నదియా అనే నాలుగేళ్ల వయసున్న పులికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని జూ పార్కులు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు, పక్షులకు.. ఇతర జీవాలకు కరోనా సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. జూ మొత్తాన్ని శుభ్రం చేస్తున్నారు. స్టాఫ్‌కు మాస్కులు, గ్లవ్స్, వారానికి ఒకసారి సోప్, శానిటైజర్లు అందజేస్తున్నారు. జూ బయట సామాజిక దూరం కష్టమయ్యే అవకాశం ఉన్నందున.. జూలోనే స్టాఫ్‌కు టిఫిన్, లంచ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

    కాగా, అమెరికాలో కరోనా సోనిక నదియాతోపాటూ... మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యం బారినపడ్డాయి. వాటిలో కొన్నింటికి ఆకలి తగ్గిపోగా... కొన్నింటిలో దగ్గు లక్షణాలు కనిపించాయి. జూలో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకి ఉంటుందనీ, అతని ద్వారా... వాటికి కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: