పీఎం కేర్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారీ విరాళం

రాష్ట్రపతి కోవింద్ ఇప్పటికే ఒకసారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. మార్చికి సంబంధించిన తన పూర్తి వేతానాన్ని పీఎం కేర్స్ నిధికి జమచేశారు.

news18-telugu
Updated: May 14, 2020, 4:12 PM IST
పీఎం కేర్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారీ విరాళం
నేడు ప్రపంచ అతిపెద్ద ధ్యానకేంద్రాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి
  • Share this:
కరోనాపై పోరాటం కోసం ఏర్పాటుచేసిన పీఎం కేర్స్ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంత మంది ప్రజలు, సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తన విరాళాలు అందజేశారు. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం తన వార్షిక వేతనంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఐతే రాష్ట్రపతి కోవింద్ ఇప్పటికే ఒకసారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. మార్చికి సంబంధించిన తన పూర్తి వేతానాన్ని పీఎం కేర్స్ నిధికి జమచేశారు కోవింద్. ఇప్పుడు ఏకంగా తన వార్షిక వేతనంలో సైతం 30 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.


కాగా, కరోనాపై పోరాటం కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం భారీగా నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే.. పీఎం కేర్స్ ట్రస్ట్ ఫండ్ నుంచి బుధవారం రూ.3100 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటిలో రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ. వెయ్యి కోట్లను వలస కార్మికుల కోసం, మరో రూ.100 కోట్లను వాక్సిన్ అభివ‌ృద్ధి కోసం కేటాయించారు.
First published: May 14, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading