ఆకలి తట్టుకోలేక నిండుగర్భిణి మృతి...దారుణం...

పాకిస్థాన్ లోని మీర్పూర్ ఖాస్ జిల్లాలో జాడో పట్టణంలో ఓ గర్భిణీ(45) ఆకలితో అలమటించి మృతి చెందినట్లు తెలుస్తోంది. వారికి ఆరుగరు పిల్లలు ఉన్నారని.. లాక్‌డౌన్‌తో వారికి పనులు దొరకక ఆకలికి రుబీనా చనిపోయిందని మృతురాలి భర్త అల్లాబాఖ్ష్ తెలిపాడు.

news18-telugu
Updated: April 20, 2020, 11:59 PM IST
ఆకలి తట్టుకోలేక నిండుగర్భిణి మృతి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్‌లో కరోనా లాక్‌డౌన్ ఆంక్షల మధ్య అక్కడ కూడా ఆకలి చావులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆకలి బాధ తట్టుకోలేక ఓ నిండు గర్భిణి మరణించిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ లోని మీర్పూర్ ఖాస్ జిల్లాలో జాడో పట్టణంలో ఓ గర్భిణీ(45) ఆకలితో అలమటించి మృతి చెందినట్లు తెలుస్తోంది. వారికి ఆరుగరు పిల్లలు ఉన్నారని.. లాక్‌డౌన్‌తో వారికి పనులు దొరకక ఆకలికి రుబీనా చనిపోయిందని మృతురాలి భర్త అల్లాబాఖ్ష్ తెలిపాడు. పనులు లేకపోవడంతో తాను చాలా ఆందోళన చెందిందని వాపోయాడు. తమకు ఎక్కడ నుంచి కూడా సహాయం అందలేదని.. తిండి లేక నా భార్య మరణించిందని చెప్పాడు.

చనిపోయిన తన భార్యను ఖననం చేయడానికి కూడా తన వద్ద డబ్బు లేదని అల్తాబఖ్ష్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికులు ముందుకు వచ్చి విరాళాలు సేకరించి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పాక్ ప్రభుత్వం పేదలను ఆదుకోవడంలో ఫెయిల్ అయిందని.. బడా బాబులకే అండగా నిలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
First published: April 20, 2020, 11:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading