PRECAUTIONARY DOSE SAID BY PM NARENDRA MODI MAY BE SAME AS THE FIRST AND SECOND DOSE VACCINE AK
Vaccine Third Dose: ప్రధాని మోదీ చెప్పిన మూడో డోసు వ్యాక్సిన్ అంటే ఇదేనా ?
ప్రతీకాత్మక చిత్రం
Booster Dose: ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల మిక్సింగ్ పనిచేస్తుందనడానికి పెద్దగా ఆధారాలు లేనప్పటికీ, బూస్టర్ డోస్‌ల గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.
దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజుల క్రితం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మూడో డోసు ఇస్తామని తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. దీన్ని బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. అయితే ప్రికాషనరీ డోసు అంటే ఎలా ఉంటుంది ? అనే చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఎవరైతే మొదటి, రెండవ డోసులో ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటారో.. ప్రికాషనరీ డోసుగా అదే వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై డేటా లేకపోవడం వల్ల ముందు మూడో డోసు విషయంలో కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల మిక్సింగ్ పనిచేస్తుందనడానికి పెద్దగా ఆధారాలు లేనప్పటికీ, బూస్టర్ డోస్‌ల గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది, ఇది ప్రికాషనరీ డోసుకు ఉందని ఓ అధికారి న్యూస్ 18కి తెలిపారు. అయితే ఈ అంశం ఇంకా చర్చ దశలోనే ఉందని.. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం ఉంటుందని వివరించారు. ప్రధానమంత్రి మూడో డోసుకు ముందుజాగ్రత్త అని పేరు పెట్టారని, బూస్టర్ డోస్‌లు కాదని మనం గుర్తుంచుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి తెలిపారు.ఇతర జనాభా కోసం బూస్టర్లపై ప్యానెల్లు ఇంకా చర్చలు జరుపుతున్నాయని అన్నారు.
ముందుజాగ్రత్త మోతాదు అనేది వైద్యులు. వైద్య నిపుణులు బలహీనంగా ఉన్న వ్యక్తులకు సూచించే మూడవ డోస్ లేదా అదనపు మోతాదు. చాలావరకు అదే టీకా అవుతుంది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని.. కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిని ముందుజాగ్రత్త డోసు అని పిలవడం వెనుక ఉన్న ప్రత్యేకమైన అర్థం ఉంది.
HIV లేదా క్యాన్సర్ వంటి కొమొర్బిడిటీలు ఉన్న వ్యక్తులు రెండు డోస్‌లకు బాగా స్పందించరని.. కాబట్టి మూడవ డోస్ ముందుజాగ్రత్తగా ఉంటుందని.. కొత్త వేరియంట్ విజృంభణ కూడా ఇందుకు మరో కారణం. బూస్టర్లపై ఇది ఖచ్చితంగా నిర్ణయం కాదని.. ఈ విషయం భారతదేశంలో ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) అపెక్స్ ప్యానెల్ వద్ద పెండింగ్‌లో ఉందని అధికారి తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.