హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

PM Modi: టీకా కోసం రాజకీయ నేతలు ఎగబడొద్దు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: టీకా కోసం రాజకీయ నేతలు ఎగబడొద్దు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తొలి దశలో మొత్తం మూడు కోట్ల మందికి టీకా ఇస్తామని.. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం వేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఐతే టీకా కోసం రాజకీయ నాయకులు ఎగబడవద్దని.. వారి వంతు వచ్చినప్పుడు మాత్రమే టీకా తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  మరికొద్ది రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ సన్నద్ధత, రాష్ట్రాల్లో తాజా పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సాయుధ బలగాలు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి దశలో మొత్తం మూడు కోట్ల మందికి టీకా ఇస్తామని.. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం వేయబోమని వెల్లడించారు. ఐతే టీకా కోసం రాజకీయ నాయకులు ఎగబడవద్దని.. వారి వంతు వచ్చినప్పుడు మాత్రమే టీకా తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

  ''అందరి సమిష్టి కృష్టితో కరోనాను ఎదుర్కోగలిగాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి దశలో ప్రయివేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఇవ్వనున్నాం. రెండో దశలో 50ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రాబోయే కొన్ని నెలల్లోనే 30 కోట్ల మంది టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మనదేశంలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లకు అనుమతిచ్చాం. మన దేశంలో తయారైన టీకాలు విదేశీ టీకాల కంటే సమర్థవంతమైనవి. మరో నాలుగు టీకాలు కూడా అందుబాటులోకి తెస్తాం. పూర్తిగా విదేశీ టీకాలపైనే ఆధారపడితే మనకు ఇబ్బందులు వస్తాయి. వ్యాక్సినేషన్‌పై రియల్ టైమ్ డేటా అవసరం. టీకా తీసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తద్వారా రెండో డోస్ ఇవ్వడం సులభమవుతుంది. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో మరోసారి భేటీ అవుతా. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దాం.'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


  మన దేశంలో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు షరతులతో డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ.. ఎన్ఐవీ, ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇక కోవిషీల్డ్ వాక్సీన్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సీన్‌ను మనదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేస్తోంది. ప్రభుత్వం కూడా వ్యాక్సీనేషన్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జనవరి 16 నుంచి తొలి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine, Covishield, PM Narendra Modi

  ఉత్తమ కథలు