Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉగ్రవాద లక్షణాలు... వైసీపీ మంత్రుల కౌంటర్ ఎటాక్

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉగ్రవాద లక్షణాలు... వైసీపీ మంత్రుల కౌంటర్ ఎటాక్

చంద్రబాబకు ఉగ్రవాద లక్షణాలు ఉన్నాయా?

ఏపీలో ఓ వైపు వైరస్ సునామీలా విరుచుకుపడుతుంటే.. మరోవైపు పొలిటికల్ దుమారం రచ్చ రచ్చ అవుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండు వైరస్ పై పొలిటికల్ వార్ మొదలెట్టాయి. ఐకమత్యంగా కరోనాను కట్టడి చేయాల్సిన సమయంలో.. పొలిటికల్ ఫైట్ చేస్తున్నాయి.

 • Share this:
  ఏపీని ఓ వైపు వైరస్ భయపెడుతుంటే.. మరోవైపు కరోనాపై పొలిటికల్ పంచ్ లు పేలుతున్నాయి. కేసులు, ప్రతి కేసులు కొనసాగుతున్నాయి. ఓ వైపు రాష్ట్రాన్ని కరోనా భయపెడుతుంటే కట్టడి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిపి ముందుకు వెళ్లాల్సిన సమయం.. కానీ ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి వేరు. కరోనాను వారి పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. అందుకే ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రస్తుతం ఉన్నది ఏ వైరస్ అంటూ వివాదం దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే విపక్షనేత చంద్రబాబుపై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు ఇదే విషయం ఓ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి చెప్పారు అంటూ.. టీడీపీ నేతలు మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు..

  ఏపీలో ఎన్ 440 వైరస్ ఉందని చంద్రాబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంత భయంకరమైన వైరస్ ఏపీని వెంటాడుతోందని.. కర్నూలులో పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందని చంద్రాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే చంద్రాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వైరస్ ఏపీలో లేదని.. ప్రజలను భయపెట్టేందుకే చంద్రాబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ మంత్రులు, నేతలు ఆ వెంటనే కౌంటర్లు వేశారు. ఏపీలో ఉన్నది ఎన్ 440 కాదని.. నారా 420 అంటూ పంచ్ లు వేశారు. అక్కడితో ఆగక పటిష్టమైన కేసులు పెట్టారు..

  ఇదీ చదవండి: కర్ఫ్యూతో కంట్రోల్ కాని కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు.. భయం భయం

  కేసుల వరకు వ్యవహారం వెళ్లినా ఏపీలో రాజకీయ సమరం ఆగడం లేదు. చంద్రబాబు, టీడీపీ నేతలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ అండ్ బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కొత్త వేరియంట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అందుకే ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు తెలుగు ప్రజలను రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎల్లో వైరస్ కారణమన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు లాగా నీచరాజకీయాలు మరెవరూ చేయలేరని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ప్రజల వైపా...వైరస్ వైపా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ఉగ్రవాదులకు ఉండే లక్షణాలన్నా ఉన్నాయంటు సంచలన ఆరోపణ చేశారు మంత్రి.

  ఇదీ చదవండి: అమ్మగా.. కూతురుగా రోజా డబుల్ రోల్.. చెవిలో పువ్వులు పెట్టుకొని ఫోజులు

  ఎన్ 440 వైరస్ విషయంలో తన పై దృష్ప్రచారం జరుగుతోంది. తాను ఒక ఛానల్ డిబేట్ లో చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారన్నారు. ఎన్ 440 వైరస్ పై ఎవరైనా డిబేట్ కు రావాలని సవాల్ విసురుతున్నా... దమ్ముంటే ఎవరైనా నాతో డిబేట్ కు రావాలి అన్నారు. మంత్రి కన్నబాబు సైతం చంద్రబాబు తీరును తప్పు పట్టారు. మంచి కోసం యజ్ఞం చేసేపటప్పుడు.. భగ్నం చేసే రాక్షసులు పక్కనే ఉంటారని చంద్రబాబును విమర్శించారు. కరోనా కట్టడికి సీఎం జగన్ యజ్ఞం చేస్తుంటే...చంద్రబాబు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒక విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలు చెయకూడదన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేదన్నారు. కర్నూలులో భయంకరమైన వేరేంట్ వచ్చిందని దుర్మార్గపు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు మన వైపు అదోలా చూస్తున్నాయన్నారు. ఒక టెర్రరిస్టులా ప్రజలను చంద్రబాబు భయబ్రాంతులకు గురు చేస్తున్నారన్నారు. అసలు ఏపీకి పట్టిన వైరస్ చంద్రబాబే అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూమ్ లో కూర్చుని పెద్ద సైంటిస్ట్ లా ఫోజు కొడుతూ.. సీఎం జగన్ కు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తే సహించమన్నారు.

  ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అనవసరంగా కనిపిస్తే వాహనాలు సీజ్

  చంద్రబాబు కు వ్యాక్సినేషన్ పై నిజాలు తెలియవా అని ప్రశ్నించారు. కేంద్రమే ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలో ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దం గా ఉంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేసి భారత బయోటెక్ నుండి రాష్ట్రానికి కావాల్సిన టీకాలు ఇప్పించగలరా? అని ప్రశ్నించారు. అలా చేయగలిగితే 1600 కోట్లు చంద్రాబు ఎకౌంట్లో వేస్తామన్నాు.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు