Home /News /coronavirus-latest-news /

POLICE SHOCKED TO SEE 18 MEMBER TRAVELLING INSIDE CONCRETE MIXER TRUCK AK

కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులో 18 మంది... అవాక్కైన పోలీసులు

ట్రక్కులో నుంచి బయటకు వస్తున్న వ్యక్తులు (Image: ANI)

ట్రక్కులో నుంచి బయటకు వస్తున్న వ్యక్తులు (Image: ANI)

లాక్‌డౌన్ కాలంలో పోలీసుల నుంచి తప్పించుకుని ఎలాగైనా ఇంటికి చేరాలని కొందరు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు సాగుతున్నారు.

    లాక్‌డౌన్ కాలంలో పోలీసుల నుంచి తప్పించుకుని ఎలాగైనా ఇంటికి చేరాలని కొందరు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు సాగుతున్నారు. ప్రమాదమని తెలిసినా... సొంతూరుకు చేరుకోవడం ఒక్కటే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు వెళ్లడానికి ఎవరూ ఊహించని ప్లాన్ వేశారు. ఓ కాంట్రిక్స్ మిక్సర్ ట్రక్కు లోపల కూర్చుని లక్నోకు వెళదామని అనుకున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు వీరి ప్లాన్‌ను పసిగట్టారు. కాంక్రీట్ మిక్సర్ ట్రక్కు అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాణించడం ఏమిటని ఆరా తీశారు. అసలు ట్రక్కులో ఏముందని వెలికి తీస్తే... అందులో నుంచి ఏకంగా 18 మంది బయటకు వచ్చారు. దీంతో పోలీసులే వారిని చూసి ఆశ్చర్యపోయారు. వారిని అదుపులోకి తీసుకుని, ట్రక్కును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Indore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు