షాకింగ్.. అంతర్వేదిలో విధులు నిర్వహించిన పోలీసులకు కరోనా

Antarvedi: రథం దగ్గర డ్యూటీలో పాల్గొన్న పోలీసుల్లో పలువురికి కరోనాకు సోకింది.

news18-telugu
Updated: September 13, 2020, 6:02 PM IST
షాకింగ్.. అంతర్వేదిలో విధులు నిర్వహించిన పోలీసులకు కరోనా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం కావడంతో కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రథం దగ్దం కావడంతో పలు పార్టీల కార్యకర్తలు, హిందూ సంఘాలు అంతర్వేది చేరుకుని ఆందోళన చేపట్టాయి. మరికొన్ని పార్టీలు అంతర్వేదిలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి అక్కడ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ స్థాయి అధికారులు అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే తాజాగా అంతర్వేదిలో విధులు నిర్వహించిన అనేక మంది పోలీసులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.

రథం దగ్గర డ్యూటీలో పాల్గొన్న పోలీసుల్లో పలువురికి కరోనాకు సోకింది. విచారణాధికారి ఎస్పీ కరణం కుమార్, ఎస్పీ నయీం అష్మి, రాజోలు సీఐ, డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్సైలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పోలీసులు, వారిని కలిసిన వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న నేపథ్యంలో... అంతర్వేదిలో విధులు నిర్వహించిన పోలీసులకు కూడా కరోనా సోకడం గమనార్హం.
Published by: Kishore Akkaladevi
First published: September 13, 2020, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading