వాహనదారులకు వార్నింగ్... అది దాటారో అంతే... తెలంగాణ సర్కార్ నిర్ణయం

లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం.. ప్రతీ వాహనం రెండు కిలోమీటర్ల లోపే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ, పలువురు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు.

news18-telugu
Updated: March 26, 2020, 9:36 PM IST
వాహనదారులకు వార్నింగ్... అది దాటారో అంతే... తెలంగాణ సర్కార్ నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు, ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అయినా కొందరు ఆకతాయిలు, పౌరులు ఏవేవో కుంటిసాకులు చెబుతూ... జాయ్ రైడింగ్‌కు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి వాహనమైనా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే.. ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలతో నిఘా ద్వారా గుర్తిస్తారు.గల్ఫ్‌ తరహా టెక్నాలజీని రాష్ట్ర పోలీసులు ఇందుకోసం వాడుతున్నారు. ఇప్పటికే అన్ని కూడళ్లు, ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి నూతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు.

కోవిడ్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా, కొందరు కర్ఫ్యూ ఆంక్షలను పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూహం రెడీ చేశారు. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు. దాని ఆధారంగా వారిపై ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 ప్రకారం కేసులను నమోదు చేస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. వాహన యజమాని వివరాలు వెంటనే తెలిసిపోతాయి.

లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం.. ప్రతీ వాహనం రెండు కిలోమీటర్ల లోపే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ, పలువురు ఇష్టానుసారం ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు. గంటల్లోనే సదరు వాహన యజమాని అరెస్టు అవుతారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు.

దీని ప్రకారం సదరు వాహనం యజమానిపై ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడు తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఇళ్ల నుం చి బయటికి వచ్చే వాహనదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులు టెక్నాలజీని ఎక్కువగా వాడుకోవాలని భావిస్తున్నారు.






First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు