కరోనాను జయించిన కానిస్టేబుల్... పూల వర్షం కురిపించిన పోలీసులు

కరోనాను జయించిన పోలీస్ కానిస్టేబుల్‌కు పూల వర్షంతో స్వాగతం

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ సీఎం భద్రత నిమిత్తం కానిస్టేబుల్ శివకుమార్‌కు ఉన్నతాధికారులు డ్యూటీ వేశారు. అనంతరం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది.

  • Share this:
    కరోనా సోకిన వారి పట్ల వివక్ష కొనసాగుతున్న సమయంలో... తమ డిపార్ట్‌మెంట్‌లో కరోనాను జయించిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు ఘన స్వాగతం పలికారు ఏపీకి చెందిన బాపట్ల పోలీసులు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ సీఎం భద్రత నిమిత్తం కానిస్టేబుల్ శివకుమార్‌కు ఉన్నతాధికారులు డ్యూటీ వేశారు. అనంతరం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా నుంచి కోలుకున్న కానిస్టేబుల్ శివకుమార్... తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతడు మళ్లీ విధుల్లో చేరుతున్న సందర్భంగా ఘనస్వాగతం పలికారు పోలీసులు అధికారులు.

    బాపట్ల టౌన్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ హాజరతయ్య నేతృత్వంలో పోలీసు సిబ్బంది శివ కృష్ణకు పూలతో ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్ఛం ఇచ్చి పోలీసు స్టేషన్‌లోకి ఆహ్వానం పలికారు. కరోనాని జయించిన పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపటానికి ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కరోనా పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని సూచించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే అది మన దరిచేరదని, ఒకవేళ కరోనా బారిన పడ్డా త్వరగా కొలుకొనవచ్చు అని బాపట్ల పట్టణ సీఐ అశోక్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: