ఏపీలో రంగంలోకి దిగిన ‘యముడు’, ‘చిత్రగుప్తుడు’...

కర్నూలు జిల్లాలోని డోన్ పట్టణంలో పోలీసులతో పాటు యముడు, చిత్రగుప్తుడు, కరోనా వైరస్ వేషధారణల్లో ఉన్నవారు కూడా వారితో తిరుగుతున్నారు.

news18-telugu
Updated: April 1, 2020, 11:19 PM IST
ఏపీలో రంగంలోకి దిగిన ‘యముడు’, ‘చిత్రగుప్తుడు’...
కర్నూలు జిల్లా డోన్‌లో యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో ప్రచారం
  • Share this:
కరోనా వైరస్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందు, లాక్ డౌన్‌ను కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా పోలీసులు కొత్త ప్రయోగం చేశారు. రోడ్ల మీద రంగంలోకి యమధర్మరాజు, చిత్రగుప్తుడిని దించాయి. యముడు, చిత్రగుప్తుడు గెటప్‌లో ఉన్న వారు రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని డోన్ పట్టణంలో పోలీసులతో పాటు యముడు, చిత్రగుప్తుడు వేషధారణల్లో ఉన్నవారు కూడా వారితో తిరుగుతున్నారు. ‘యముడు మిమ్మల్ని చూస్తున్నాడు. బయటకు వచ్చారో మిమ్మల్ని తీసుకెళ్లిపోతాడు. ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు, ఒకవేళ కరోనా వచ్చినట్టు అనుమానం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా వారు ప్రచారం చేస్తున్నారు.

‘కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు డోన్ పట్టణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రతిరోజూ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కరోనా వైరస్ వేషాల్లో ఆర్టిస్టులను కూడా రంగంలోకి దింపాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేయాలి. ఇది ఓ రకంగా యుద్ధం చేయడమే.’ అని డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ రెడ్డి చెప్పారు. కరోనా అనే శత్రువుని మనం నేరుగా చూడలేమని, కాబట్టి బయటకు రాకుండా ఉండడమే బెటర్ అని ఆయన అన్నారు.
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading