హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

వందల మందితో పార్టీ.. హైదరాబాద్‌లో మ్యారేజ్ రిసెప్షన్‌పై కేసు

వందల మందితో పార్టీ.. హైదరాబాద్‌లో మ్యారేజ్ రిసెప్షన్‌పై కేసు

బ్యాంకు అధికారులు అతడికి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా కూడా సెలవులు పొందొచ్చా? అంటూ నెటిజన్లు తెగ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యాంకు అధికారులు అతడికి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా కూడా సెలవులు పొందొచ్చా? అంటూ నెటిజన్లు తెగ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

వివాహ వేడుకకు 50 మందికి మంచి ఉండకూదని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. కానీ ఇవేమీ పట్టకుండా కొందరు వందలాది మందితో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు.

  లాక్‌డౌన్ 4లో మరిన్ని సడలింపులు ఇవ్వడంతో చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గుంపులుగా ఉండొద్దని.. వందల మందితో వేడుకలు చేసుకోవద్దని.. పోలీసులు పదేపదే చెబుతున్నా పెడ చెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ రిసెప్షన్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసిఫ్ నగర్‌ పరిధిలోని జగదాంబ నగర్‌లో ఓ ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లో మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది. ఈ విందుకు 150 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘించి అంతమందితో వేడుక చేసినందుకు గాను ఫర్నిచర్ వ్యాపారి పి.నర్సింగ్ రావుతో పాటు అతని కుమారుడు కిషోర్ కుమార్ పై ఎపిడమిక్ట్ యాక్ట్ కింద కేసు పెట్టారు.

  హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో నమోదయ్యే కేసుల్లో దాదాపు 80 శాతం ఇక్కడి నుంచే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో GHMC పరిధిలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివాహ వేడుకకు 50 మందికి మంచి ఉండకూదని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. కానీ ఇవేమీ పట్టకుండా కొందరు వందలాది మందితో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు