news18-telugu
Updated: November 26, 2020, 5:55 PM IST
ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్‌ను (కోవాగ్జిన్) ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోదీ పరిశీలిస్తారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అభివృద్ది చేసిన అస్త్రాజెనెకా వ్యాక్సిన్‌ను పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరం ఇన్స్టిట్యూట్ పర్యటనకు వస్తున్నట్టు అధికారిక సమాచారం అందింది. కానీ, మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వివరాలు అందాల్సి ఉంది.’ అని పూణె డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావ్ తెలిపారు.
Tirupati ByPolls: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇస్తున్న బీజేపీ, తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు?కేటీఆర్‌కు ‘దొరికిపోయిన’ బీజేపీ.. బండి సంజయ్‌పై బీభత్సంగా ట్రోలింగ్
Breaking News: ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్
భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కొవిడ్ 19 నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. వ్యాకిన్ తయారీ, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై ఈ సందర్భంగా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించారు.
Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు
సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 27న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నవంబర్ 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
3 నిమిషాల్లో 30 మ్యాజిక్స్... చూస్త్రే థ్రిల్ అయిపోతారు.. అందుకే గిన్నిస్ రికార్డు
గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ
మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి గ్రేటర్‌పై కమలం జెండాను ఎగురవేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది జాతీయ నేతలను ప్రచారానికి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు హైదరాబాద్‌లో పర్యటించి క్యాంపెయిన్ చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజే బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 26, 2020, 5:48 PM IST