ప్రధాని మోదీ ప్రసంగం.. రేపు ఉదయ 10 గంటలకు

ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

 • Share this:
  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను మరోమారు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 4 నుంచి రెండు వారాల పాటు, అంటే మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే లాక్ డౌన్‌న ప్రకటించారు. తొలుత మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 విధించారు. ఆ తర్వాత మే 3 వరకు పొడిగించారు. ఇప్పుడు మరో రెండు వారాల పాటు మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

  కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయి. అక్కడ యథాతధంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లనో మాత్రం కొంత వరకు ఆంక్షలను సడలిస్తారు. అప్పటి వరకు విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై నిషేధం ఉంటుంది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, బహిరంగ సభలకు అనుమతి లేదు. ఇది అన్ని జోన్లకూ వర్తిస్తుంది.

  రెడ్ జోన్లలోనూ కొన్నంటికి మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించవచ్చు. ఐతే వలస కార్మికులను తరలించే బస్సులు, రైళ్లకు మాత్రం అనుమతి ఉంటుంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: