జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. డేట్ ఫిక్స్...

జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. డేట్ ఫిక్స్...

ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)

ఈనెల 21న ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని అధికారవర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 • Share this:
  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈనెల 21న ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని అధికారవర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజులుగా (జూన్ 16, జూన్ 17) దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మీద రాష్ట్రాల్లో పరిస్థితులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బతుకు బండి కూడా నడవాలన్న కారణంగా అన్ లాక్ 1 పేరుతో భారీగా సడలింపులు కూడా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

  కరోనా వైరస్ కంటే ప్రస్తుతం చైనా ఆర్మీ, భారత సైనికుల ఘర్షణలో 20 మంది సైనికులు చనిపోవడం భారతీయులను కలవరపాటుకు గురిచేసింది. చైనా గత కొన్నిరోజులుగా దుస్సాహసానికి ఒడిగడుతోందని ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అమరజవాన్లకు నివాళి అర్పించారు. వారి పోరాటం, బలిదానాలు వృధాగా పోవని చెప్పారు. భారత్ శాంతి కోరుకుంటుందని, అవసరమైతే దీటుగా బదులిస్తుందని కూడా చైనాకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఈ అంశంపై 19న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశం తర్వాత జూన్ 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

  ఈ ఏడాది జూన్ 21న చాలా ప్రత్యేకమైన రోజు. అదే రోజున ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే, ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే ఉన్నాయి. అలాగే, సూర్యగ్రహణం కూడా ఉంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు