PM Modi Speech: రూ.13 వేల ఫైన్ కట్టిన ప్రధాని ఎవరంటే...మోదీ స్పీచ్‌లో హైలైట్ ఇదే...

లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ నిబంధనలను పాటించారని ప్రధాని మోదీ అన్నారు. కానీ అన్‌లాక్ ప్రారంభమైన వెంటనే కొంతమంది అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు.

news18-telugu
Updated: June 30, 2020, 6:26 PM IST
PM Modi Speech: రూ.13 వేల ఫైన్ కట్టిన ప్రధాని ఎవరంటే...మోదీ స్పీచ్‌లో హైలైట్ ఇదే...
(File)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ లాక్ 2.0, గరీబ్ కల్యాణ్ యోజన వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎం మోదీ నిబంధనలు పాటించని వారిని హెచ్చరించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ నిబంధనలను పాటించారని ప్రధాని మోదీ అన్నారు. కానీ అన్‌లాక్ ప్రారంభమైన వెంటనే కొంతమంది అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు దేశ పౌరులందరూ మళ్లీ అదే అప్రమత్తతను చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిబంధనలను పాటించని వ్యక్తులను ఆపి వారికి వివరించాలని కోరారు. మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్లేస్ కు వెళ్లడంతో ఓ దేశ ప్రధానికి 13 వేల జరిమానా విధించిన సంగతి గుర్తు చేశారు. గ్రామానికి సర్పంచి అయినా దేశ ప్రధానమంత్రి, ఎవరూ నిబంధనలకు అతీతులు కారు అని, బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్ గురించి తన ప్రసంగంలో మోదీ ఉదాహరించారు.

local for vocal: పీఎం మోదీ

అన్ని జాగ్రత్తలు తీసుకొని మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగం పుంజుకునేలా చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. స్వావలంబన భారత్ కోసం మనందరం 'local for vocal' సంకల్పంతో కదలాలని పిలుపు నిచ్చారు. 130 కోట్ల మంది దేశస్థులు ఇదే సంకల్పంతో కలిసి పనిచేయాలన్నారు.

One nation One Ration Card: పీఎం మోదీ
ఈ రోజు దేశంలోని పేదలు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ఒక దేశం - ఒక రేషన్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మోదీ తెలిపారు. దీని ద్వారా ప్రయోజనం ఏమిటంటే, తమ గ్రామాన్ని విడిచిపెట్టి, ఉపాధి లేదా ఇతర అవసరాలకు వేరే ప్రాంతాలకు వెళ్ళే పేద ప్రజలకు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే రేషన్ పొందే వీలు కలుగుతుంది.
First published: June 30, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading