Oxygen Concentrators: లక్ష ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ల కొనుగోలు.. పీఎం కేర్స్ నుంచి నిధులు మంజూరు

ప్రధాని నరేంద్ర మోదీ

ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కొనుగోలుకు బుధవారం పీఎం కేర్స్ నుంచి నిధులను మంజూరు చేశారు

  • Share this:
    ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఈ ప్రాణవాయువు కోసమే కరోనా రోగులు అల్లాడుతున్నారు. సకాలంలో అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేసింది కేంద్రం. స్టీల్ ప్లాంట్స్ నుంచి రైళ్లు, యుద్ధ విమానాల ద్వారా ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ తెప్పిస్తున్నారు. ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కొనుగోలుకు బుధవారం పీఎం కేర్స్ నుంచి నిధులను మంజూరు చేశారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. వైద్య నిపుణుల సూచన మేరకు లక్ష ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ల కొనుగోలుకు ప్రధాని మోదీ నిర్ణయించారు. వెంటనే నిధులను కూడా మంజూరుచేశారు. వీలైనంత త్వరగా వీటిని సమకూర్చుకొని.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

    ఇటీవలే దేశవ్యాప్తంగా 713 ప్రెజర్ స్వింగ్ ఆడ్సార్ప్షన్ (PSA) ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. పీఎం కేర్స్ నుంచి నిధులను కూడా విడుదల చేశారు. ఈ నిధులతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఆక్జిన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం దేశీయ ఉత్పత్తిదారులకు డీఆర్‌డీవో, సీఎస్ఐఆర్ సాంకేతిక సాయం అందించనున్నాయి. పీఎస్‌ఏలతో పాటు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందుబాటులోకి వస్తే ఆక్సిజన్ సమస్య చాలా వరకు తీరుతుంది. అక్కడికక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి నేరుగా రోగులకు అందించవచ్చు.


    మరోవైపు భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మంగళవారం 3,60,960 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. కొత్తగా మొన్న 2,771 మంది చనిపోగా నిన్న... 3,293 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,00,187కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,61,162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,48,17,371కి చేరింది. రికవరీ రేటు 82.3 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 29,78,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,23,912 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 28 కోట్ల 27లక్షల 03వేల 789 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 25,56,182 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 14కోట్ల 78లక్షల 27వేల 367 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: