లాక్‌డౌన్‌పై ఎలా ముందుకెళదాం... ప్రధాని మోదీ కీలక భేటీ

లాక్‌డౌన్‌పై ఎలా ముందుకెళదాం... ప్రధాని మోదీ కీలక భేటీ

ప్రస్తుతం సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, సినిమా షూటింగ్స్ లాంటివి మినహా షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

ఇప్పటికే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లపై స్పష్టత ఇచ్చిన కేంద్రం... లాక్ డౌన్‌ ఎత్తివేత లేదా మినహాయింపులపై ఎలాంటి ప్రకటన చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

  • Share this:
    మే 3తో లాక్‌డౌన్ ముగియనుండటంతో... ఆ తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని నరేంద్రమోదీ కీలక సమాలోచనలు జరుపుతున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీతో అయ్యారు. ఈ ప్రధాన భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, పీయుష్‌ గోయల్‌తో పాటు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు. లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహాలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనాపై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారంతా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లపై స్పష్టత ఇచ్చిన కేంద్రం... లాక్ డౌన్‌ ఎత్తివేత లేదా మినహాయింపులపై ఎలాంటి ప్రకటన చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: