PM NARENDRA MODI CALLS FOR SOCIAL DISTANCE AFTER SUCCESS OF JANATA CURFEW BA
జనతా కర్ఫ్యూ తర్వాత దేశ ప్రజలకు మోదీ మరో సూచన..
ప్రధాని మోదీ
Janata Curfew | ‘ఇదే సంకల్పంతో, ఈ సమయంలో మరో సుదీర్ఘ పోరాటం చేద్దాం. మనల్ని మనం స్వీయ నిర్బంధంలో (సామాజిక దూరం) ఉంచుకుందాం.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
PM Modi on CoronaVirus | కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కటయ్యారు. ఉదయం 7 గంటల నుంచి ఇళ్లలోనే ఉన్న ప్రజలు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ, పళ్లాల మీద గరిటెలతో కొడుతూ కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతరులకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీ లాంటి మహానగరాల నుంచి మారుమూల పల్లెటూళ్ల వరకు ప్రజలు ఇలా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో తాను పిలుపునిచ్చినట్టు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇవి కేవలం చప్పట్లు కావని, కరోనా వైరస్‌పై పోరాటంలో విజయనాదం అని ప్రధాని మోదీ అన్నారు. ‘కరోనా వైరస్ మీద పోరాడుతున్న ప్రతి ఒక్కరికి దేశం ఒక్కటిగా కృతజ్ఞతలు తెలిపింది. దేశ ప్రజలు అందరికి ధన్యవాదాలు. ఇది చప్పట్ల శబ్దం మాత్రమే కాదు. కరోనాపై పోరాటంలో విజయానికి ఆరంభం నాదం. ఇదే సంకల్పంతో, ఈ సమయంలో మరో సుదీర్ఘ పోరాటం చేద్దాం. మనల్ని మనం స్వీయ నిర్బంధంలో (సామాజిక దూరం) ఉంచుకుందాం.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
कोरोना वायरस की लड़ाई का नेतृत्व करने वाले प्रत्येक व्यक्ति को देश ने एक मन होकर धन्यवाद अर्पित किया। देशवासियों का बहुत-बहुत आभार... #JantaCurfew
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.