HOME » NEWS » coronavirus-latest-news » PM MODI VIDEO CONFERENCE WITH CMS OVER CORONA VACCINE DISTRIBUTION CM KCR ATTENDED NS

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం.. ముందుగా అందించేది వారికే.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

శాస్త్రీయంగా ఆమోదింపబడిన కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

news18-telugu
Updated: November 24, 2020, 3:28 PM IST
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం.. ముందుగా అందించేది వారికే.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
శాస్త్రీయంగా ఆమోదింపబడిన కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాన్ని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించామని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదన్నారు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలన్నారు. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలని కేసీఆర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ తదితరులు పాల్గొన్నారు.

మొదట అందించేది వారికే..
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్ పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
Published by: Nikhil Kumar S
First published: November 24, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading