ప్రధానమంత్రి మరో కీలక నిర్ణయం... 8వ తేదీ ఉదయం 11 గంటలకు...

ప్రధాని నరేంద్ర మోదీ

ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

  • Share this:
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసారి ఆల్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో పార్టీల ఫ్లోర్ లీడర్లు (లోక్‌సభ, రాజ్యసభ కలిపి కనీసం 5గురు ఎంపీలు ఉన్న పార్టీలు)తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. కోవిడ్ 19 నియంత్రణ చర్యలను చర్చించేందుకు ప్రధాని మోదీ ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

    ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌పై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన


    ఈనెల 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. లైట్లు ఆర్పేయడం వెనుక శాస్త్రీయత ఏముందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు?, ఏ మేరకు బాధితులను ఆదుకోవాలో చెప్పకుండా లైట్లు ఆర్పేసి, దీపాలు వెలిగించమని చెప్పడం ఏంటని విమర్శించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న  ప్రధానమంత్రి రాజకీయ పార్టీలతో మాత్రం కనీసం చర్చించలేదని విమర్శించారు. దీంతో ప్రధాని పార్లమెంట్‌లో కనీసం ఐదుగురు ఎంపీల ప్రాతినిధ్యం ఉన్న పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: