థాంక్యూ ట్రంప్... వెంటిలేటర్ల విరాళంపై ప్రధాని మోదీ

భారత్‌కు వెంటిలేటర్లు విరాళంగా పంపుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

news18-telugu
Updated: May 16, 2020, 3:21 PM IST
థాంక్యూ ట్రంప్... వెంటిలేటర్ల విరాళంపై ప్రధాని మోదీ
ప్రధాని మోదీ, ట్రంప్ అభివాదం (Credit - Twitter - Elias Valverde)
  • Share this:
భారత్‌కు వెంటిలేటర్లు విరాళంగా పంపుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘థాంక్యూ డొనాల్డ్ ట్రంప్. ఈ మహమ్మారి మీద మనం అంతా ఉమ్మడిగా పోరాడాలి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు దేశాలు సంయుక్తంగా పోరాడడం ప్రధానం.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అనంతరం భారత్, అమెరికా స్నేహానికి మరింత బలం చేకూరుతుంది అని కూడా మోదీ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించే క్రమంలో భారత్‌కు వెంటిలేటర్లు పంపుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతకు ముందు ప్రకటించారు. ‘మా మిత్రదేశం భారత్‌కు వెంటిలేటర్లు విరాళంగా పంపడం గర్వంగా ఉంది. ఈ సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సపోర్టుగా ఉంటాం.’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా 200 మెబైల్ వెంటిలేటర్లను (ఒక్కొక్కటి రూ.10 లక్షలు) భారత్‌కు విమానాల ద్వారా అందజేయనున్నట్టు తెలుస్తోంది.

Published by: Ashok Kumar Bonepalli
First published: May 16, 2020, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading