హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

PM Modi: కరోనా కల్లోలం.. రాష్ట్రాలకు ప్లాన్-బి సూచించిన ప్రధాని మోదీ

PM Modi: కరోనా కల్లోలం.. రాష్ట్రాలకు ప్లాన్-బి సూచించిన ప్రధాని మోదీ

PM Modi: కరోనా పరిస్థితిపై ప్రజలకు సందేశం ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రధాని మోదీ.. ఈ పరిస్థితిని ఏ రకంగా అధిగమించాలనే అంశాలను వివరించడంతో పాటు లాక్‌డౌన్‌లు పెట్టవద్దని రాష్ట్రాలకు కీలక సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా చదవండి ...

  దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇందుకోసం వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు భారీ మొత్తంలో రుణాలు కూడా మంజూరు చేసింది. అయితే కరోనా కట్టడి కోసం గతంలో మాదిరిగా లాక్‌డౌన్‌లు విధించకుండా.. మిగతా విధానాలను అవలంభించాలని కేంద్రం భావిస్తూ వస్తోంది. రాష్ట్రాలకు సైతం ఇదే సూచిస్తోంది. లాక్‌డౌన్ వంటి వాటిని అమలు చేస్తే మళ్లీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతుందని.. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్థిక రంగానికి ఇది మరింత ఇబ్బందిగా మారుతుందని కేంద్రం పదే పదే చెబుతూ వస్తోంది.

  తాజాగా కరోనా పరిస్థితిపై ప్రజలకు సందేశం ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రధాని మోదీ.. ఈ పరిస్థితిని ఏ రకంగా అధిగమించాలనే అంశాలను వివరించడంతో పాటు లాక్‌డౌన్‌లు పెట్టవద్దని రాష్ట్రాలకు కీలక సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు జార్ఖండ్ వంటి రాష్ట్రాలు పాక్షిక, పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నాయి.

  ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు పయనిస్తే మళ్లీ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని భావించిన కేంద్రం.. మరిన్ని రాష్ట్రాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవద్దని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. లాక్‌డౌన్ అన్నది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చివరి అస్త్రమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అయినా గతంలో కరోనాకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఆ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

  లాక్‌డౌన్‌కు బదులుగా మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసుకుని కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చూడటంలో యువకులది కీలక పాత్ర అని.. యువకులు కమిటీలుగా ఏర్పడి ఈ దిశగా కృషి చేయాలని అన్నారు. మొత్తానికి కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ రకమైన సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  First published:

  Tags: Lockdown, PM Narendra Modi

  ఉత్తమ కథలు