PM MODI SAYS NO COUNTRY WIDE LOCKDOWN WILL BE IMPLEMENTED STATES TO CHOOSE NIGHT CURFEW TO CONTROL COVID 19 CASES AK
PM Modi: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ క్లారిటీ.. రాష్ట్రాలకు కీలక సూచన
ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi: కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. దీన్ని అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని తెలిపారు. కరోనా కట్టడి, వాక్సినేషన్ వంటి అంశాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కరోనా కట్టడికి కావాల్సిన మౌలిక వసతులు, వ్యూహాలు లేకపోవడంతో లాక్డౌన్ విధించాల్సి వచ్చిందన్న మోదీ.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ విధించడం ఓ మంచి ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారు వరకు నైట్ కర్ఫ్యూ పెడితే మంచిదని అన్నారు. దాన్ని రాత్రి కర్ఫ్యూకు బదులుగా కరోనా కర్ఫ్యూ అని పిలిస్తే బాగుంటుందని అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. కరోనా బారిన పడిన వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్స్‌లో కనీసం 30 మందిని మూడు రోజుల్లోపు పరీక్షించాలని తెలిపారు. కొంతమంది కరోనాను లైట్ తీసుకుంటున్నారని.. కొన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం సైతం ఈ అంశంపై సీరియస్‌గా ఫోకస్ చేయడం లేదని అన్నారు.
మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో 45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ 100 శాతం టీకా అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మోదీ సూచించారు. దేశంలో టీకా పొందే అర్హత ఉన్నవాళ్లందరికీ కరోనా టీకా అందేలా యువకులు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు.