Home /News /coronavirus-latest-news /

PM MODI SAYS COWIN PLATFORM BEING MADE OPEN SOURCE IN GLOBAL CONCLAVE AK

ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులో కోవిన్ యాప్.. కరోనాపై పోరులో టెక్నాలజీది కీలక పాత్ర అన్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

PM Narendar Modi: కోవిన్ యాప్ ద్వారా భారత్‌లో 350 మిలియన్ డోసులను ప్రజలకు అందించామని తెలిపారు.

    ప్రపంచదేశాలన్నింటికీ కోవిన్ యాప్ అందుబాటులోకి ఉండేలా చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్‌ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 50 దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణ కోసం కోవిన్ యాప్‌పై ఆసక్త చూపాయి. కెనెడా, మెక్సికో, నైజీరియా, ఉగాండా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భారతీయ సమాజం భావిస్తోందని ప్రధాని అన్నారు. ఈ కారణంగా కోవిన్ టెక్నాలజీని అందరికీ అందుబాటులో ఉంచేందుకు సిద్ధమయ్యామని తెలిపారు.

    కరోనాపై పోరాటంలో తమ అనుభవాలు, వనరులు వంటి వాటిని ఇతర దేశాలతో పంచుకునేందుకు సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలో ఎంతటి బలమైన దేశమైనా సమస్యను పరిష్కరించుకోలేదని అన్నారు. కరోనాపై పోరాటంలో టెక్నాలజీది కీలక పాత్ర అని మోదీ అన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను దేశంలో సుమారు 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. ఈ యాప్‌ను ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో వ్యాక్సినేషన్ వ్యూహం ఖరారు చేసే సమయంలో పూర్తి డిజిటల్ ఫార్మాట్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీని ద్వారా ప్రజలు వ్యాక్సిన్ పొందారనే విషయాన్ని తెలుసుకోవచ్చని.. వాళ్లు ఎక్కడ, ఎవరి ద్వారా వ్యాక్సిన్ పొందారని గుర్తించవచ్చని అన్నారు.

    వ్యాక్సిన్ వినియోగం, వృధాను కూడా డిజిటల్ అప్రోచ్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ప్రధాని మోదీ అన్నారు. కోవిన్ యాప్ ద్వారా భారత్‌లో 350 మిలియన్ డోసులను ప్రజలకు అందించామని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు ఎలాంటి పేపర్లు తమతో తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌లోనే ఈ మొత్తం సమాచారం డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటుందని అన్నారు. ఒక ప్రపంచ, ఒక ఆరోగ్యం అనేక విధానంతో ప్రపంచం మొత్తం మహమ్మారిని జయిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Cowin Portal

    తదుపరి వార్తలు