PM Modi: కరోనా కట్టడికి ప్రధాని మోదీ వరుస సమావేశాలు.. పలు కీలక నిర్ణయాలు..

PM Modi: కరోనా కట్టడికి ప్రధాని మోదీ వరుస సమావేశాలు.. పలు కీలక నిర్ణయాలు..

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

PM Modi: వ్యాక్సిన్ ఉత్పత్తి సహా కరోనా కట్టడికి అవసరమయ్యే మందుల ఉత్పత్తిని పెంచే అంశంపై వారితో చర్చించారు.

  • Share this:
    దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతుండటంతో.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీ ఇందుకోసం వరుస సమావేశాల్లో పాల్గొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా సోమవారం ప్రధాని మోదీ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఉదయం వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానితో సమావేశం తరువాతే దేశంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారు.

    అనంతరం ఆయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార అంశంపై చర్చించారు ప్రధాని మోదీ. కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రచారం సందర్భంగా కేవలం 500 మందితో మాత్రమే ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. అందులోనూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఇక సాయంత్రం దేశంలోని పలువురు ప్రముఖ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. పరిస్థితిపై అధ్యయనం చేశారు.

    అనంతరం ప్రముఖ ఫార్మా కంపెనీలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సహా కరోనా కట్టడికి అవసరమయ్యే మందుల ఉత్పత్తిని పెంచే అంశంపై వారితో చర్చించారు. వీటితో పాటు దేశంలోని ఆరోగ్యరంగం మౌలిక వసులు, మందులు, ఆక్సిజన్ సరఫరాపై చర్చించారు. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు, పడకల పెంపు, ఐసీయూ లభ్యతపై ప్రధాని మోదీ చర్చించారు. ప్రస్తుతం ఆయన నవరాత్రి ఉపవాస దీక్షలో ఉన్నారు. ఏడో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: