ముస్కురాయేగా ఇండియా పాటను మెచ్చుకున్న ప్రధాని మోదీ..

కరోనా వైరస్ తెచ్చిన సంక్షోభం నుంచి కోలుకొని మళ్లీ ఇండియా నవ్వుతుందంటూ సాగిన ఓ పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.

news18-telugu
Updated: April 7, 2020, 10:55 AM IST
ముస్కురాయేగా ఇండియా పాటను మెచ్చుకున్న ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ (Photo : Twitter)
  • Share this:
కరోనా వైరస్ తెచ్చిన సంక్షోభం నుంచి కోలుకొని మళ్లీ ఇండియా నవ్వుతుందంటూ సాగిన ఓ పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. హిందీలో 'ముస్కురాయెగా ఇండియా' అంటూ సాగిన ఈ పాటలో ప్రముఖ బాలీవుడు నటులు అక్షయ్ కుమార్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, తాప్సీ పన్నూ, కియారా అద్వానీ, ఆయుష్మాన్ ఖుర్రానా, భూమి పెడ్నేకర్, సిధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌషల్, రాజ్ కుమార్ రావు, అనన్య పాండే, కృతి సనోన్, జాకీ భగ్ననే కనిపించారు. "ఫిర్ మస్కురాయెగా ఇండియా ... ఫిర్ జీత్ జయెగా ఇండియా... ఇండియా పోరాడుతుంది.. ఇండియా గెలుస్తుంది అనే అర్థంతో సాగిన ఈ పాట ద్వారా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు  హిందీ నటులు.  ఈ పాటను కౌషల్ కిషోర్ రాయగా విశాల్ మిశ్రా స్వరపరిచారు.. ఆయనే పాడారు కూడా. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Published by: Suresh Rachamalla
First published: April 7, 2020, 10:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading