ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భేటీ... లాక్ డౌన్‌పై రేపు నిర్ణయం?

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భేటీ... లాక్ డౌన్‌పై రేపు నిర్ణయం?

అమిత్ షా, నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు.

  • Share this:
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా నిన్న ఫోన్లో మాట్లాడారు. లాక్ డౌన్ మీద ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. ఈ క్రమంలో అమిత్ షా నేడు ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిన సమాచారాన్ని ఆయన ప్రధాని మోదీకి చేరవేస్తారు. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ 4 ఈనెల 31తో ముగుస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాని మోదీ, అమిత్ షా చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ కొనసాగించాలా? వద్దా అనే అంశంపై రేపు నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్రం మరో రెండు వారాలు లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశాలను పరిశీలిస్తోందని నిన్న అమిత్ షాతో ఫోన్ సంభాషణ అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు