Lockdown Extension : లాక్‌డౌన్‌పై వారి వాదనకే ప్రధాని మోదీ ప్రాధాన్యం..

ప్రధాని మోదీ (Photo : Twitter)

Lockdown Extension : లాక్‌డౌన్ కొనసాగించాలి.. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు తప్ప అందరు సీఎంలు ముక్త కంఠంతో అన్న మాట ఇది. కరోనా తీవ్రత దృష్ట్యా కచ్చితంగా అవసరం అని నొక్కి చెప్పారు.

  • Share this:
    Lockdown Extension : లాక్‌డౌన్ కొనసాగించాలి.. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు తప్ప అందరు సీఎంలు ముక్త కంఠంతో అన్న మాట ఇది. కరోనా తీవ్రత దృష్ట్యా కచ్చితంగా అవసరం అని నొక్కి చెప్పారు. లేకపోతే త్వరలో కరోనా మరింత దారుణంగా విజృంభించే ప్రమాదం ఉందని మోదీకి వివరించారు. ఆ మాటలను సావధానంగా విన్న ప్రధాని మోదీ.. వారి వాదనను తీసి పారేయలేదు. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలన్న సీఎంల కోరికను మన్నిస్తూనే, మరో మూడు రోజులు అదనంగా అంటే.. మే 3 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు మోదీ. ఏప్రిల్ 30 గురువారం వస్తోంది. ఆ తర్వాత వారాంతం రానున్నందున ఆ రోజులను కూడా కలుపుకొని ఆదివారం(మే 3) వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించారు.

    రెండో విడత లాక్‌డౌన్‌ ఎలా కొనసాగాలన్న దానిపై రేపు గైడ్ లైన్స్ విడుదల చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే, ఈ నెల 20 తర్వాత పరిస్థితి సమీక్షిస్తామని, ఆ తర్వాత ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అటు.. లాక్‌డౌన్ కోసం ఏడు సూత్రాలను మోదీ ప్రతిపాదించారు. ఆ ఏడు సూత్రాలను అమలు చేస్తే.. దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా అన్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: