PM Modi: గ్రామాల్లో ఇంటింటికీ పరీక్షలు చేయండి.. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వండి.. కరోనా నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)

దేశంలోని వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు.

  • Share this:
    దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు.. ఈ సమావేశంలో.. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్యసంరక్షణ మౌలికసదుపాయాలు, టీకా రోడ్‌మ్యాప్ పై ప్రధానికి అధికారులు వివరాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల టెస్టుల చేస్తే.. ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్టుల వరకు పెరిగాయని ప్రధానికి అధికారులు వివరించారు. క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుతుందని, రికవరీ రేటు పెరుగుతుందనే అంశాలను అధికారులు ప్రధాని మోదీకి తెలియజేశారు.

    అనంతరం స్పందించిన ప్రధాని మోదీ.. అధిక టెస్ట్ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో టెస్టులను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. టెస్ట్ పాజిటివిటీ రేట్ అధికంగా ఉన్న జిల్లాల్లో స్థానికంగా కంటైన్‌మెంట్ వ్యుహాలను అత్యవసర ప్రతిపాదికన అమలు చేయాలని మోదీ సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ పరీక్షలు నిర్వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. కరోనా వ్యాప్తిపై నిఘా పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్మికులను అవసరమైన సాధానాలు చేకూర్చాలని కోరారు. అలాగే గ్రామీణప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాపై దృష్టిసారించాలని ఆదేశించారు. వెంటిలేటర్లు,ఇతర పరికరాల ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్న అధికారులకు సూచించారు.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరుతుండగా.. కానీ వ్యాక్సిన్ల కోరత కారణంగా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సరైన క్రమంలో ముందుకు సాగడం లేదు. మరోవైపు దాదాపు 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఈ ఏడాది చివరి వరకు అందుబాటులోకి వస్తాయని గురువారం ప్రభుత్వం తెలిపింది.





    ఇక, దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజ‌ృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది. కొత్తగా 3,890 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,66,207కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.07 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,53,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,04,32,898కి చేరింది. రికవరీ రేటు 83.8 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 36,73,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: