Home /News /coronavirus-latest-news /

PM MODI ADDRESS TO THE NATION TONIGHT AT 8 PM BS

PM Narendra Modi Speech : రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

PM Modi Address to the Nation | దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

    దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సమర్థవంతంగా కొనసాగుతుండటం, సడలింపులు ఇస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ నెల 17తో లాక్‌డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను దేశం ఎలా ఎదుర్కొంటోంది? వైద్యులు, వైద్య బృందం, పోలీసులు, ప్రభుత్వాల పనితీరును ఆయన కొనియాడే అవకాశాలున్నాయి. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి కరోనాను ఎదుర్కొంటున్న తీరును ఆయన ప్రస్తావించే అవకాశాలున్నాయి.

    అటు.. ఆర్థిక రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నందున పలు రంగాలకు ఊతం ఇచ్చేలా మరిన్ని ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాత్రి 8 గంటలకు పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Coronavirus, Lockdown, National News, Pm modi

    తదుపరి వార్తలు