ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ మూడో విడత డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు కసరత్తు మొదలైంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వేర్వేరు వర్గాలకు వేర్వేరుగా ఆర్థిక చేయూతను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎవరెవరికి ఎంత ప్రకటించిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే మొత్తం రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేసింది. మూడో విడత డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్టు ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ డబ్బులు విడతల వారీగా జమ కానున్నాయి. ఎవరెవరికి ఎప్పుడు డబ్బులు జమ అవుతాయో తెలుసుకోండి.
The 3rd installment of ex-gratia announced for women #JanDhanYojana account holders under the #PMGKY package will be disbursed as per the following schedule. Beneficiaries can withdraw the amount from branches, ATMs or CSPs. #PMJDY #SBI pic.twitter.com/k43pxKDQIU
— State Bank of India (@TheOfficialSBI) June 3, 2020
జూన్ 5- అకౌంట్ నెంబర్ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి
జూన్ 6- అకౌంట్ నెంబర్ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి
జూన్ 8- అకౌంట్ నెంబర్ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి
జూన్ 9- అకౌంట్ నెంబర్ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి
జూన్ 10- అకౌంట్ నెంబర్ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి
జూన్ 5న నగదు బదిలీ ప్రారంభమై జూన్ 10న ముగుస్తుంది. ఏటీఎంల దగ్గర రద్దీని కంట్రోల్ చేసేందుకు 5 రోజులు 5 విడతల్లో నగదు బదిలీ చేయనుంది బ్యాంకు. డబ్బులు అకౌంట్‌లో పడగానే విత్‌డ్రా చేయడానికి హడావుడిగా వెళ్లాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకు మిత్రాలు, సీఎస్పీల దగ్గర ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా
SBI: సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన ఎస్‌బీఐ
Jio Plans: జియోలో ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎంత లాభం? తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Personal Finance, Pradhan Mantri Jan Dhan Yojana, Sbi, State bank of india