కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,70,000 కోట్లతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వివిధ వర్గాలకు ఆర్థిక చేయూతను ప్రకటించింది కేంద్రం. ఎవరెవరికి ఎంత ఆర్థిక సాయం ప్రకటించిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వారికి ఇప్పటికే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. వారి జన్ ధన్ అకౌంట్‌లో ఈ డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్టైతే మీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేసి ఉంటాయి. మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో పొందొచ్చు. మరి బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు జన్ ధన్ అకౌంట్ ఉంటే 18004253800 లేదా 1800112211 నెంబర్లకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీకు చివరి 5 ట్రాన్సాక్షన్లు, మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి. 9223766666 నెంబర్‌కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
Punjab National Bank: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జన్ ధన్ అకౌంట్ ఉంటే 18001802223 లేదా 01202303090 నెంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీకు బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. లేదా BAL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 16 అంకెల అకౌంట్ నెంబర్ టైప్ చేసి 5607040 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే మీ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.
Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు జన్ ధన్ అకౌంట్ ఉంటే 09015135135 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
Oriental Bank of Commerce: ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో మీకు జన్ ధన్ అకౌంట్ ఉంటే 8067205767 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ తెలుసుకోవాలి.
Indian Bank: ఇండియన్ బ్యాంక్‌లో జన్ ధన్ ఖాతా ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 180042500000 లేదా 9289592895 నెంబర్‌కు కాల్ చేసి బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.