కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. ముందు వాళ్లకే..

వాక్సీన్ తయారైతే వాటిని దేశమంతటా ఎలా పంపిణీ చేయాలి? ఎవరికీ ముందు ఇవ్వాలి? వివిధ డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న దానిపై మార్గదర్శకాలు సూచించారు.

news18-telugu
Updated: June 30, 2020, 6:03 PM IST
కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. ముందు వాళ్లకే..
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
కరోనాను తరిమికొట్టే వాక్సిన్‌ను పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ కరోనా వాక్సీన్ సిద్ధమైతే, సరసమైన ధరకే అందుబాటులో ఉండేలా.. అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం కరోనా వాక్సిన్ అభివృద్ధి, పంపిణీ సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలపై చర్చించారు.

ఈ సందర్భంగా అధికారులకు నాలుగు కీలక సూచనలు చేశారు ప్రధాని మోదీ. వాక్సీన్ తయారైతే వాటిని దేశమంతటా ఎలా పంపిణీ చేయాలి? ఎవరికీ ముందు ఇవ్వాలి? వివిధ డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న దానిపై మార్గదర్శకాలు సూచించారు.

1. కరోనా ముప్పు అధికంగా ఉండే డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలకు ముందుగా టీకాలు ఇవ్వాలి.

2. కరోనా వాక్సీన్ ప్రతి ఒక్కరికీ అందేలా కార్యాచరణ రూపొందించాలి. దేశంలోని ప్రతి ప్రాంతానికి వాక్సిన్‌ను సరఫరా చేయాలి. వాక్సీన్ పంపిణీకి ఎలాంటి ఆంక్షలు అడ్డుతగలకుందా జాగ్రత్తలు తీసుకోవాలి.

3. కరోనా టీకాలు సరసమైన ధరలకే అందరికీ అందుబాటులో ఉండాలి. అధిక ధరల కారణంగా ఎవరూ టీకాకు దూరం కాకూడదు.

4. కరోనా వాక్సిన్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు అన్నింటినీ ప్రత్యేక టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలి. నిర్ణీత సమయంలో సమర్థంగా వాక్సీన్ వేసేందుకు వేసేందుకు పలు టెక్నాలజీ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.

ఇక ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మన దేశంలో భారత్ బయోటెక్ కంపెనీ కూడా వాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. కొవాక్సిన్ (COVAXIN) అనే వాక్సిన్‌ను భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారుచేసింది. ఈ వ్యాక్సీన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు గాను ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)అనుమతి ఇచ్చింది. జులైలో దేశవ్యాప్తంగా కొవాక్సిన్ ఔషద ప్రయోగాలు జరగనున్నాయి.
First published: June 30, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading