Stay at Home : లాక్‌డౌన్‌పై ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ కపుల్ హార్టీ మెసేజ్

Stay at Home | Coronavirus | Covid 19 : సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి ఎప్పుడూ టచ్‌లో ఉండే కోహ్లీ కపుల్... తాజాగా ఏం చెప్పారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: March 25, 2020, 1:17 PM IST
Stay at Home : లాక్‌డౌన్‌పై ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ కపుల్ హార్టీ మెసేజ్
లాక్‌డౌన్‌పై ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ కపుల్ హార్టీ మెసేజ్ (credit - twitter - virat kohli)
  • Share this:
Coronavirus | Covid 19 : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. సోషల్ మీడియాలో మెసేజ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు ప్రతి ఒక్కరం లాక్‌డౌన్ పాటిద్దామనీ... సమూహాలుగా ఉండకుండా... ఇంట్లోనే ఉంటూ... 21 రోజులు గడుపుదామని తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని కోరారు. ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాప్తిపై సీరియస్‌గా ఉండాలనీ, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పినట్లు నడచుకోవడం అందరికీ అవసరం అని వారు సూచించారు. ఇది మనకు పరీక్షా కాలం అన్న అనుష్క శర్మ... అందరం కలిసి ఆదేశాలు పాటిద్దామని వేడుకుంటున్నట్లు తెలిపింది.


ఇలా వీళ్లిద్దరూ కరోనా వైరస్‌పై దేశ ప్రజల్ని వేడుకోవడం ఇది రెండోసారి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 500 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడటం, అధికారికంగా 9 మంది చనిపోవడంతో.. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌పై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి అంశాల్లో దేశ ప్రజలతో ముందుకు సాగేందుకూ, వారిని వేడుకునే విషయంలో కోహ్లీ ఎప్పుడూ ముందే ఉంటున్నాడు. కోహ్లీకి ఇండియాతోపాటూ... ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందువల్ల అతను చెప్పే ప్రతీ మాటనూ ఫాలోయర్లు ఆసక్తిగా వింటారు.




కోహ్లీ కపుల్‌తోపాటూ సచిన్ టెండుల్కర్, పీవీ సింధు, వీరేంద్ర సెహ్వాగ్, సౌరబ్ గంగూలీ, సైనా నెహ్వాల్ తదితరులు కోట్ల మంది తమ అభిమానులకు ఇలా మెసేజ్‌లు ఇస్తూ... అప్రమత్తం చేస్తున్నారు.
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు