Fact Check: డిసెంబర్ వరకు స్కూళ్లు ఓపెన్ చేయరా?

Fact Check | తెలంగాణలో స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకునేదెప్పుడు? స్కూళ్ల రీఓపెనింగ్‌పై కేంద్రం ఆలోచనలేంటీ? వీటిపై స్పష్టత రాకముందే సోషల్ మీడియాలో అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

news18-telugu
Updated: August 17, 2020, 3:14 PM IST
Fact Check: డిసెంబర్ వరకు స్కూళ్లు ఓపెన్ చేయరా?
Fact Check: డిసెంబర్ వరకు స్కూళ్లు ఓపెన్ చేయరా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పిల్లలు కరోనా వైరస్ నుంచి సేఫ్ అని ప్రభుత్వం భావించేంత వరకు స్కూళ్లను తెరిచేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోవడంతో కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ వరకు స్కూళ్లు మూసేస్తుందన్నది ఆ ఫేక్ న్యూస్ సారాంశం. వీటిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్కూళ్లు తెరవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా స్కూళ్ల రీఓపెన్‌పై స్పందించింది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించింది.


కేంద్ర ఆరోగ్య శాఖ, హోం మంత్రిత్వ శాఖలతో చర్చించిన తర్వాత స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలోనే స్పష్టం చేశారు. అంతేకాదు... కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని స్కూళ్లు న్యూ నార్మల్‌కు అనుగుణంగా ఉండాలన్నారు. స్కూళ్లు రీఓపెన్ చేసే సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాటించాల్సిన నియమనిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి కానున్నాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్ మారనుంది. తరగతుల్ని ఒకేసారి నిర్వహించే అవకాశం లేదు. స్కూల్ టైమింగ్స్ కూడా మారే అవకాశముంది.

స్కూళ్లను ఎప్పటి వరకు మూసి ఉంచాలి, ఎప్పుడు తెరవాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సోషల్ మీడియాలో పుకార్లను, తప్పుడు వార్తలను నమ్మకూడదు. సరైన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌‌సైట్స్ మాత్రమే ఫాలో కావాలి.
Published by: Santhosh Kumar S
First published: August 17, 2020, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading