హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron-specific Vaccine : ఒమిక్రాన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్

Omicron-specific Vaccine : ఒమిక్రాన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్

కరోనా వైరస్(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా వైరస్(ప్రతీకాత్మక చిత్రం)

Omicron Vaccine : ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఫైజర్ -జర్మనీకి చెందిన బయోన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్ రెడీ చేశాయి. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను తాజాగా ప్రారంభించారు.

Pfizer-BioNTech Begin Trials : ప్రస్తుతం ప్రపంచాన్ని గెన్షన్ పెడుతోన్న పేరు ఒమిక్రాన్. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కోవిడ్ వేరియంట్ వల్ల మళ్లీ దేశాలు ఆంక్షల చట్రంలోకి వెళుతున్నాయి. ఒమిక్రాన్ విజృంభణ కారణంగా మనదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా... నైట్ కర్ఫ్యూలు,వీకెండ్ లాక్ డౌన్ లు విధించిన విషయం తెలిసిందే. అయితే అత్యధిక మ్యూటేషన్లు ఉన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఫైజర్ -జర్మనీకి చెందిన బయోన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్ రెడీ చేశాయి. ప్రత్యేకంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పోరాటానికి సిద్ధం చేసిన వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆ కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.

మొత్తం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను మూడు భాగాలుగా విభజించారు. ఇప్పటికే మూడు నెలల ముందుగా రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొంతమందికి.. అలాగే మూడు డోసులు అంటే బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వారికి మరికొంత మందికి వ్యాక్సిన్ ఇస్తారు. అసలు ఇప్పటి వరకూ కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని మూడో కేటగిరిలో చేర్చి పరిశోధన నిర్వహిస్తారు. 18- 55 సంవత్సరాల వయస్సు గల 1,420 మంది ఆరోగ్యవంతమైన పెద్దలకు మొదట వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వారిని పరీక్షించి... వచ్చే ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ సమర్థతను నిర్ణయిస్తారు. హ్యూమన్ ట్రయల్స్‌లో వచ్చే ఫలితాలను బట్టి వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక,ఫైజర్- బయోఎన్‌టెక్ ఇప్పటికే కోవిడ్‌కు బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. 2022లో నాలుగు బిలియన్ డోస్‌ ల కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయాలని ఫైజర్-బయోఎన్‌టెక్ లక్ష్ంగా పెట్టుకున్నాయి.

ALSO READ Children infected with covid : ఒమిక్రాన్ విజృంభణ..ఆ దేశంలో కోటి మందికి పైగా చిన్నారులకు కరోనా

మరోవైపు, ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రపంచ దేశాలు బూస్టర్ డోస్ ల పంపిణీని ముమ్మరం చేశాయి. బూస్టర్ డోస్‌ వల్ల వచ్చే వ్యాధినిరోధకత ఎన్ని రోజులుంటుందనే సందేహాలు మొదలుకావడంతో శాస్త్రవేత్తలు అధ్యయనాలు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ మూడో డోస్(బూస్టర్ డోస్) తీసుకున్న తర్వాత ఓమిక్రాన్ వేరియంట్‌ను నిరోధించగల యాంటీబాడీలు నాలుగు నెలల పాటు ఉంటాయని తేలింది. అమెరికా శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అధ్యయన ఫలితాలను ప్రిప్రింట్ సర్వర్‌లో గత శనివారం ప్రచురించారు. రోగనిరోధకత చెక్కుచెదరకుండా ఉండటలో వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. అయితే, పీర్-రివ్యూ పూర్తికాని ఈ అధ్యయనంపై మరింత విశ్లేషణ అవసరం. కనీ, నాల్గవ డోస్ అవసరం తక్షణమే అవసరం లేదని మాత్రం అధ్యయనం సూచిస్తుంది. ఇజ్రాయెల్ సహా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్ పంపిణీ జరుగుతోన్న విషయం తెలిసిందే.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid vaccine, Omicron corona variant, Pfizer Vaccine

ఉత్తమ కథలు