పిల్లికి కరోనా పాజిటివ్... బ్రిటన్‌లో ఇదే తొలి కేసు... వైరస్ ఎలా సోకింది?

Coronavirus updates : కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించినట్లే... అరుదైన సందర్భాల్లో... మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాపిస్తోంది. కానీ జంతువుల నుంచి మనుషులకు మాత్రం వ్యాపిస్తున్నట్లు ఆధారాలు లేవు.

news18-telugu
Updated: July 28, 2020, 1:20 PM IST
పిల్లికి కరోనా పాజిటివ్... బ్రిటన్‌లో ఇదే తొలి కేసు... వైరస్ ఎలా సోకింది?
పిల్లికి కరోనా పాజిటివ్... బ్రిటన్‌లో ఇదే తొలి కేసు... వైరస్ ఎలా సోకింది? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్రిటన్ (UK)లో తొలిసారిగా ఓ జంతువు (పిల్లి)కి కరోనా పాజిటివ్ వచ్చిందని అక్కడి ప్రధాన వెటెరినరీ ఆఫీసర్ క్రిస్టిన్ మిడిల్‌మిస్ తెలిపారు. జులై 22న ఓ పిల్లికి వెబ్రిడ్జి‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ (APHA)లో టెస్టులు చెయ్యగా... కరోనా పాజిటివ్ వచ్చిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఐతే... జంతువుల ద్వారా మనుషులకు కరోనా సోకుతుంది అనేందుకు ఇప్పటివరకూ ఆధారం లేదు అని మిడిల్‌మిస్ సోమవారం తెలిపారు. ఇప్పుడు ఈ పిల్లిని జాగ్రత్తగా గమనించి, పెంపుడు జంతువుల ఓనర్లకు ఏవైనా సలహాలూ, సూచనలూ ఇవ్వాలనుకుంటే ఇస్తామని క్లారిటీగా చెప్పారు.

ఇంతకీ పిల్లికి కరోనా ఎలా సోకిందో మనకు తెలియాలి కదా. దాని ఓనర్లకు అంతకుముందు కరోనా టెస్టులు జరపగా వారికి పాజిటివ్ వచ్చింది. వారి నుంచే పిల్లికి సోకి ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, ఫుడ్ అండ్ రూరల్ ఎఫైర్స్... ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆ పిల్లికీ, దాని ఓనర్లకు కూడా కరోనా లేదు. పోయింది. అందరూ రికవరీ అయ్యారు కాబట్టి... ఇక ఏ జంతువులకూ, మనుషులకూ వారి ద్వారా కరోనా సోకే ఛాన్స లేదని అంటున్నారు.

"ఇదో అరుదైన ఘటన. జంతువులకు కరోనా సోకడం అన్నది ఎప్పుడో ఒకసారి జరుగుతోంది. పిల్లికి స్వల్ప లక్షణాలే కనిపించాయి. కొన్ని రోజుల్లోనే రికవరీ అయ్యింది" అని మిడిల్‌మిస్ (Middlemiss) తెలిపారు.

"పెంపుడు జంతువుల ఓనర్లకు మా సూచన ఏంటంటే... వాళ్లకు కరోనా వస్తే... స్వయంగా ఐసోలేట్ అవ్వాలి. అలాగే... పెంపుడు జంతువుల్ని తమ దగ్గరకు రానివ్వకుండా చేసి వాటిని కాపాడాలి. అలాగే అత్యంత శుభ్రత పాటించాలి. తరచూ చేతుల్ని కడుక్కోవాలి" అని బ్రిటిష్ వెటెరినరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేనియల్లా డాస్ శాంటోస్ అన్నారు.

శాంటోస్ ఇంకో మాట కూడా అన్నారు. "ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే... తాము ఇళ్లలోనే ఉంటూ... తమ పిల్లుల్ని కూడా ఇళ్లలోనే ఉండేలా చెయ్యాలి. అందుకు ఆ పిల్లికి ఇష్టమైతైనే అలా చెయ్యాలి. కొన్ని పిల్లులకు ఇళ్లలోనే ఉండటం నచ్చదు. అలా ఉంటే అవి ఒత్తిడిగా ఫీలవుతాయి. అలాంటి పిల్లులను ఇళ్లలోనే ఉంచడం కుదరదు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోండి" అని చెప్పారు.
Published by: Krishna Kumar N
First published: July 28, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading