హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Credit Card: క్రెడిట్ కార్డుపై మారటోరియంతో మీకే నష్టం... ఎలాగంటే

Credit Card: క్రెడిట్ కార్డుపై మారటోరియంతో మీకే నష్టం... ఎలాగంటే

Credit Card: క్రెడిట్ కార్డుపై మారటోరియంతో మీకే నష్టం... ఎలాగంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Credit Card: క్రెడిట్ కార్డుపై మారటోరియంతో మీకే నష్టం... ఎలాగంటే (ప్రతీకాత్మక చిత్రం)

Credit Card | క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకుందామనుకుంటున్నారా? క్రెడిట్ కార్డు బిల్లు వాయిదా వేస్తే నష్టపోవాల్సిందే. ఎలాగో తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మారటోరియంను పొడిగించిన సంగతి తెలిసిందే. వీటిపై బ్యాంకులు గైడ్‌లైన్స్ విడుదల చేయాల్సి ఉంది. నియమనిబంధనల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మొదటి మూడు నెలలు మారటోరియం ఎలా ఉందో తర్వాతి మూడు నెలలు కూడా అలాగే ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లులకూ మారటోరియం వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకుంటే నష్టం తప్పదు. బిల్లులు చెల్లించడానికి అస్సలు డబ్బులు లేనప్పుడే మారటోరియం ఎంచుకోవాలి. డబ్బులు ఉన్నా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకుండా ఉంటే వడ్డీ భారీగా చెల్లించక తప్పదు. క్రెడిట్ కార్డుపై 24 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంటే ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లు రూ.10,000 ఉందనుకుంటే వడ్డీ రూ.2,000 వరకు చెల్లించాల్సి వస్తుంది.

మారటోరియం ఎంచుకోవడం ద్వారా మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయడం కాస్త వెసులుబాటే అయినా దాని వల్ల ప్రతికూల పరిణామాలు ఉంటాయి. ఆర్‌బీఐ చెప్పినట్టు మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉండకపోయినా మీరు మారటోరియం ఎంచుకున్న అంశం బ్యాంకు రికార్డుల్లో ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఇతర రుణాలకు దరఖాస్తు చేస్తే ఈ అంశం ప్రభావం చూపించొచ్చు. అందుకే మారటోరియం ఎంచుకోకుండా క్రెడిట్ కార్డు బిల్లు కట్టేయడం మంచిది. ఒకవేళ డబ్బులు లేకపోతే ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఈఎంఐగా మార్చుకుంటే వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది. లేదా మినిమమ్ డ్యూ కట్టేసి బిల్లును మిగతా బ్యాలెన్స్ వచ్చేనెలలో కట్టేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

Lockdown: క్రెడిట్ కార్డ్ ఉందా? లాక్‌డౌన్‌లో ఈ తప్పులు చేయొద్దు

Credit Card: డబ్బులు లేవా? క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టండి ఇలా

Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

First published:

Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Credit cards, Lockdown, Personal Finance

ఉత్తమ కథలు